ఒక్క అడుగు.. ఒక్క అడుగు దూరంలో 'కల్కి'!!

వైజయంతి మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న చిత్రం కల్కి. సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం సంచలన వసూళ్లను రాబడుతోంది. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా దీన్ని తెరకెక్కించారు. రెండు వారాలకు కల్కి రూ.990 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం కూడా ఈ సినిమాలో భాగమైంది.

మూడురోజులకే రూ.415 కోట్లు
సినిమా విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.191 కోట్లను, రెండురోజులకు రూ.298 కోట్లు, మూడురోజులకు మొత్తం రూ.415 కోట్లను వసూలుచేసి రూ.1500 కోట్ల దిశగా పయనించింది. విడుదలైన అన్నిచోట్లా మౌత్ టాక్ తోపాటు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రూ.1500 కోట్ల లక్ష్యంతో కల్కి బరిలోకి దిగగా రెండు వారాలకు రూ.990 కోట్లు వసూలు చేసి రూ.వెయ్యి కోట్లతో రికార్డు నెలకొల్పేందుకు అడుగు దూరంలో నిలబడింది. ఈ వారంలో సులువుగా వెయ్యి కోట్లరూపాయల మార్క్ ను అందుకుంటుందని భావించారుకానీ రూ.10 కోట్ల దూరంలో నిలబడిపోయింది.

prabhas kalki 2898ad movie latest collections details here

అమెరికాలో సంచలనం
ఈ సినిమా అమెరికాలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే అక్కడ 20 మిలియన్ డాలర్లను రాబట్టింది. మన కరెన్సీ ప్రకారం రూ.83 కోట్లు రాబట్టింది. చాలా ప్రాంతాల్లో వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న కల్కిపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. రూ.1500 వసూలు చేయాల్సిన అవసరంలేదుకానీ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను బద్దలు కొడితే చాలని అభిమానులు అంటున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం కల్కి సినిమా కచ్చితంగా రూ.2వేల కోట్లు వసూలు చేస్తుందంటున్నారు. సినిమా విడుదలకు ముందు మాత్రం నిర్మాత అశ్వనీదత్ రూ.1500 కోట్లు టార్గెట్ గా పెట్టుకొని వస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమా ఇంకా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+