బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ రిలేషన్!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'ది రాజా సాబ్' హీరోయిన్ మాళవిక మోహనన్, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వీరిద్దరూ కేవలం ఇండస్ట్రీ సహచరులు మాత్రమే కాదు.. చిన్ననాటి స్నేహితులని ఆమె తెలిపారు. ఒకప్పుడు వీరిద్దరూ ఇరుగుపొరుగు ఉండేవారట.

చిన్నప్పటి నుంచే స్నేహం
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మాళవిక, విక్కీ కౌశల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "విక్కీ నాకు అత్యంత పాత స్నేహితుడు. నాకు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే ఆయన తెలుసు. అప్పుడు విక్కీకి ఆరేడు ఏళ్లు ఉంటాయి. మేమిద్దరం ఇరుగుపొరుగున ఉండేవాళ్లం" అని మాళవిక చెప్పుకొచ్చారు.

Prabhas Raja Saab Actress Malavika Mohanan Reveals Longtime Bond with Vicky Kaushal

బర్త్‌డే పార్టీలు, మలయాళీ వంటకాలు
చిన్నప్పుడు జరిగిన సరదా సంఘటనలను మాళవిక పంచుకున్నారు. మాళవిక తల్లి చేసే మలయాళీ వంటకాలంటే విక్కీకి చాలా ఇష్టమట. తరచూ విక్కీ వారి ఇంటికి భోజనానికి వచ్చేవాడని, ఆ సమయంలో ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లని ఆమె తెలిపారు. చిన్నప్పుడు బర్త్‌డే పార్టీల్లో 'పాసింగ్ ది పార్శిల్' లాంటి ఆటలు ఆడేవారట. ఆ సమయంలో విక్కీ తన డ్యాన్స్‌తో అందరినీ అలరించేవాడని మాళవిక గుర్తు చేసుకున్నారు. విక్కీ చిన్నప్పటి నుంచే అద్భుతమైన డ్యాన్సర్ అని ఆమె ప్రశంసించారు.

కెరీర్, సినిమాలపై చర్చ
మాళవిక 2013లో సినిమాల్లోకి రాగా.. విక్కీ 2015లో 'మసాన్' సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. వయసులో మాళవిక కంటే విక్కీ ఐదేళ్లు పెద్దవారైనప్పటికీ, ఆమె ఆయన కంటే ముందే కెరీర్ ప్రారంభించారు. అయితే వీరిద్దరూ కలిసినప్పుడు మాత్రం కెరీర్ లేదా సినిమాల గురించి సీరియస్ చర్చలు అస్సలు చేయరట. కేవలం పాత జ్ఞాపకాలు, సాధారణ విషయాల గురించే మాట్లాడుకుంటారట.

బాక్సాఫీస్ వద్ద 'ది రాజా సాబ్' హవా
మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించిన 'ది రాజా సాబ్' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జనవరి 9న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇండియాలో ఐదు రోజుల్లో సుమారు 119.45 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా 175.35 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+