Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజా సాబ్ రివ్యూ.. ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా ? ఫట్టా ??

గ్లోబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి, సలార్, కల్కి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించి.. ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ చేసుకొని మారుతి దర్శకత్వంలో "రాజా సాబ్‌" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ.. నేడు ( జనవరి 9, 2026 ) థియేటర్స్ లో రిలీజ్ కానుంది. కానీ ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ పడ్డాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీతో ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టారా ? లేదా తెలుసుకుందాం..

తెలుగు హీరో నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మూవీ చేయడం ఏంటని సినిమా అనౌన్స్ మెంట్ నుంచే టాక్ నడిచింది. అంతే కాకుండా ప్రభాస్ మొదటిసారి హార్రర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ చేయడం.. వింటేజ్ ప్రభాస్ పక్కా అంటూ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పైగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. 2025లో ఒక్క మూవీని కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఆయన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వారికి సంక్రాంతి పండుగకు స్పెషల్ గిఫ్ట్ గా మూవీ వచ్చేసింది.

prabhas-raja-saab-movie-review-and-rating-in-telugu

కథేంటి..

డబ్బు ప్రధానం అనుకునే కనకరాజు (సంజయ్ దత్) దేవనగర సామ్రాజ్య జమిందారిణి గంగా దేవి (జరీనా వాహెబ్)పై కన్నేసి.. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకుని రాజ్య సంపదను దోచుకోవాలని అనుకుంటాడు. అందుకు తగ్గట్టు గానే బైరాగి అనే క్షుద్ర మాంత్రికుడి సాయంతో అనుకున్నది సాధిస్తాడు. ఆ తర్వాత కనకరాజు ఏమయ్యాడు ? గంగాదేవిని రాజ్యం వదిలి సామాన్యురాలిగా ఎలా మారింది ? నాయనమ్మ కోరిక మేరకు తాతను ఆమె మనవడు రాజు (ప్రభాస్) కనిపెట్టాడా ?? ఆ ప్రయాణంలో అతనికి సాయపడిన వారు ఎవరు ? చివరికి ఏం జరిగింది అనేది మూవీ కథగా చెప్పొచ్చు.

మూవీ రివ్యూ..

కథంతా నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని ఒక రహస్య కోట చుట్టూ తిరుగుతుంది. డబ్బంటే ప్రాణమైన కనకరాజు (సంజయ్ దత్) తన మాయాజాలంతో సంపాదించిన సొమ్ముని కోటలో దాచుకుని, చనిపోయిన తర్వాత కూడా అది తనకే దక్కాలని వీలునామా రాస్తాడు. సెకండాఫ్‌లో సంజయ్ దత్-ప్రభాస్ మధ్య మైండ్ గేమ్ మొదలవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. చనిపోయాక ఆత్మగా మారిన కనకరాజు తన భార్యను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నాడన్న అంశం ఉత్కంఠను కలిగిస్తుంది. అయితే ప్రభాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అనవసర సన్నివేశాలు జోడించడం వల్ల అసలు కథ దారి తప్పినట్లు అనిపిస్తుంది.

అయితే ఇంటర్వెల్‌కి ముందు వచ్చే సన్నివేశాలతో సెకండాఫ్‌లో విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. కోటలో ఇరుక్కున్న హీరో అసలు పని వదిలేసి హీరోయిన్లతో రొమాన్స్ చేసే పనిలో ఎక్కువగా ఉంటారు. ఆయన కోసం ముగ్గురు భామలు పోటీపడే సీన్లు అంతగా మెప్పించవు. ప్రీ క్లైమాక్స్‌ యాక్షన్ సీన్లు ఫర్వాలేదనిపించగా.. క్లైమాక్స్ మాత్రం అంతగా మెప్పించలే లేదు. ముఖ్యంగా ట్రైలర్ లో కనిపించినా సీనియర్ ప్రభాస్ ఏమయ్యారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలిపోయి బయటికి వచ్చేస్తాం.

నటీనటుల ప్రదర్శన..

  • చాలా రోజుల తర్వాత ప్రేక్షకులకు వింటేజ్ ప్రభాస్ దర్శనమిస్తాడు. కామెడీ టైమింగ్, మేనరిజం, డైలాగ్ డెలివరీ ఫ్రెష్‌గా ఉన్నాయి. నాయనమ్మ కోసం పోరాడే మనవడిగా, ముగ్గురు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న ప్రియుడిగా ప్రభాస్ అలరిస్తాడు.
  • కనకరాజుగా సంజయ్ దత్ గంభీరంగా కనిపిస్తూ తక్కువ డైలాగ్స్‌తోనే ప్రభావం చూపించారు.
  • నాయనమ్మ పాత్రలో జరీనా వాహెబ్ సెంటిమెంట్‌తో మెప్పిస్తారు.
  • ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లకు అందాల ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. మాళవికాకు మాత్రం కొంత ఎక్కువ స్పేస్ దక్కింది.
  • వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య పెద్దగా నవ్వించలేకపోయారు.
  • బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ సైక్రియాటిస్ట్ పద్మభూషణ్‌గా కీలక పాత్రలో కనిపించారు.

టెక్నికల్ అంశాలు..

కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ గ్రాండ్‌గా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే గ్రాఫిక్స్ కొన్ని చోట్ల నిరాశపరుస్తాయి.

తమన్ సంగీతం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు; నేపథ్య సంగీతం అవసరానికి మించి శబ్దంగా అనిపిస్తుంది.

మైనస్ పాయింట్లు..

3 గంటల 9 నిమిషాల రన్‌టైమ్ సినిమా పెద్ద మైనస్. రొమాన్స్ సీన్స్‌, ల్యాగ్ ఉన్న ఎపిసోడ్‌లు బోర్ కొట్టిస్తాయి. క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో నిలవదు.

ఫైనల్ వెర్డిక్ట్..

'ది రాజా సాబ్' మంచి కథతో మొదలైనా, స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటంతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేదు. భారీ అంచనాలతో వెళ్లే అభిమానులకు కొంత నిరాశ కలిగించొచ్చు. అయితే ప్రభాస్ కామెడీ టైమింగ్, వింటేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అలరిస్తాయి.

రేటింగ్ ; 2.75/5

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+