ప్రభాస్ "రాజా సాబ్" టీజర్ రిలీజ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఈరోజు పండుగ అనే చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు ఈ హీరో. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.
కాగా రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్‌కు అయితే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. టీజర్‌లో వింటేజ్ లుక్ ప్రభాస్, స్టైలిష్ యాక్షన్, పంచ్ డైలాగ్స్, కామెడీ ట్రాక్, రొమాన్స్ అన్నీ ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా ఉన్నాయి. ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ టీజర్ విడుదల చేశారు.

అదిరిపోయిన టీజర్..
ఈ టీజర్లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముగ్గురు హీరోయిన్ల గ్లామర్ మరింత యాడ్ అప్ తీసుకొచ్చింది. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయింది. ఇక సంజయ్ దత్ వింత గెటప్స్, ఆ రాజ మహల్ చుట్టూ జరిగే కథ, హారర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. వీఎఫ్ఎక్స్ మాత్రం అదిరిపోయింది. టీజర్‌లో ప్రభాస్ స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్ ట్రీట్‌లా ఉన్నాయి. మరీ ముఖ్యంగా తమన్ బీజీఎం మాత్రం టాప్ నాచ్‌లో ఉంది. ఇక కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్‌ను చూపించేలా ఉంది.
తాత వైర్ కొరికేశాడేమో చూడండ్రా బయట అంటూ డార్లింగ్ చెప్పిన డైలాగ్ అందరినీ నవ్విస్తోంది. టీజర్ తరువాత మారుతికి డార్లింగ్ ఫ్యాన్స్ మదిలో పది మెట్లు ఎక్కేశాడనిపిస్తోంది. అసలు డార్లింగ్‌ను ఎలా చూడాలని ఫ్యాన్స్ ఇన్నేళ్లు అనుకుంటూ ఉన్నారో.. అచ్చం అలానే చూపించారు మారుతి. ఇక ఈ టీజర్ చూసిన తరువాత ఫ్యాన్స్ సైతం నీకు గుడి కట్టినా తక్కువే అన్నా అంటూ మారుతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
MARUTHI MASS#TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/pC03Ihn3Ak
— 𝑺𝒖𝒋𝒊𝒕𝒉 𝒔𝒂𝒉𝒐𝒐 (@sujithsahoo) June 16, 2025
#TheRajaSaabTeaser Aadiripoyindhiiiiiii Mawa 💥
— 𝙨𝙝𝙞𝙫𝙖ᵖˢᵖᵏ🦁 (@ShivaSatte37696) June 16, 2025
Vintage Rebel ⭐ is back💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/atXOPcVHYg












Click it and Unblock the Notifications