'ది రాజాసాబ్' టీజర్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎప్పటినుంచో ఊరిస్తున్న ముూవీ ది రాజాసాబ్. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కోసం ఓ బిగ్ సర్ ప్రైజ్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్ రిలీజ్ అయి సంవత్సరం కావస్తోంది. అయితే ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి టీజర్ మాత్రం రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ తోపాటు మూవీ లవర్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇక ఈ మూవీని క్రేజీ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడో..
ఈ సినిమా విడుదల తేదీపైనా ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. తొలుత ఏప్రిల్ 10, 2025న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ.. పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. ఇదే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో కానీ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2, హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ, ప్రశాంత్ నీల్ సలార్ 2.. చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్స్ ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనకరాజ్ లతోనూ మూవీస్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇవి అధికారికంగా ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications