రాజా సాబ్ వస్తున్నాడు.. చూడు: రిలీజ్ డేట్ ఫిక్స్
Raja Saab release date: ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం.. రాజా సాబ్. ఓ రొమాంటిక్ కామెడీ- హార్రర్ జానర్ మూవీ ఇది. మారుతి దర్శకుడు. బాహుబలి తరువాత డ్యూయెల్ రోల్ చేస్తోన్నాడిందులో. మిర్చీ తరువాత అన్నీ సీరియస్ క్యారెక్టర్లను చేస్తూ వస్తోన్న ఈ యంగ్ రెబెల్ స్టార్.. ఇందులో ఓ లైటర్ వీన్ పాత్రలో కనిపించనున్నాడు.
350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తోన్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, సంజయ్ దత్, రిద్ధికుమార్, మురళీశర్మ, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, యోగిబాబు.. ఇతర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. థమన్ సంగీత దర్శకుడు.

ఈ సినిమాపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. ప్రభాస్ అభిమానుల్లో జోష్ నింపేలా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అలాగే- టీజర్ రిలీజ్ తేదీని కూడా కన్ ఫర్మ్ చేశారు. రాజా సాబ్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను కూడా తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీన్ని పోస్ట్ చేశారు.
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అభిమానుల ముందుకు రాబోతోంది. టీజర్.. ఈ నెల 16న విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. 16వ తేదీన సోమవారం ఉదయం 10:52 నిమిషాలకు టీజర్ ఫ్యాన్స్ ముందుకు రానుంది.
సలార్, కల్కి 2989 ఏడీ తరువాత బ్లాక్ బస్టర్ ల తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న మూవీ ఇదే. డిఫరెంట్ జానర్ కావడం వల్ల మంచి అంచనాలు ఉన్నాయి రాజా సాబ్ పై. రొమాంటిక్ హార్రర్- కామెడీ మూవీలో నటించడం ప్రభాస్ కూ ఇదే తొలిసారి. ఫలితంగా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది డిసెంబర్ 5వ తేదీన తేలిపోతుంది.
The dates of the REBEL FESTIVAL 🔥
— The RajaSaab (@rajasaabmovie) June 3, 2025
⁰Teaser on JUNE 16th at 10:52 AM⁰Worldwide Grand Release - DECEMBER 5th#Prabhas #TheRajaSaab #TheRajaSaabOnDec5th pic.twitter.com/pakHM2hysr












Click it and Unblock the Notifications