మరోసారి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్న ప్రభాస్...
బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్', 'అదిపురుష్ వంటి సినిమాలు చేశాడు. తాజాగా రీలిజయిన సలార్ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ తర్వాతి చిత్రం కల్కి. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ క్రమంలో సోషల్‌మీడియాలో ప్రభాస్‌పై ఓ వార్త తెగచక్కర్లు కొడుతుంది. ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్తున్నట్లు..కల్కి సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడనున్నట్లు ఓ వార్త తెగ ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే. 'బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో యాక్షన్స్ సీన్స్ చేస్తుండగా ప్రభాస్‌కు సమస్య మొదలైందట. ఈ నొప్పితోనే 'సాహో', 'రాధేశ్యామ్', 'అదిపురుష్ వంటి చిత్రాల షూటింగ్‌లు పూర్తిచేశారు. ఇక ఆదిపురుష్ సినిమా తర్వాత దీని తీవ్రత ఎక్కువయిందని అందుకే మరోసారి సర్జరీకోసం ప్రభాస్‌కు విదేశాలకు బయలుదేరుతన్నట్లు వార్తలోస్తున్నాయి. ఈ సమస్యతోనే సలార్ ప్రమోషన్స్‌లో కూడా ప్రభాస్ పెద్దగా కనిపించలేదని టాక్ వినిపిస్తోంది.

కల్కి సినిమా వాయిదా పడే అవకాశం...
ప్రభాస్‌కు మళ్లీ సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు సూచించినట్లు టాక్. ఈ సర్జరీ కోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. అయితే, ప్రభాస్ విదేశీ ప్రయాణంపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇది కేవలం సోషల్‌మీడియాలో వస్తున్న ప్రచారమనే అని తెలుస్తోంది. ఈ వార్తే నిజమైతే కల్కి సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. కల్కి సినిమాను మే 9న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ విదేశీ ప్రయాణంతో కల్కీ వాయిదా వేయక తప్పేలా లేదు. ఇప్పటికే సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికి సమ్మర్ అనుకున్నారు. సమ్మర్‌లో అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే..












Click it and Unblock the Notifications