పవన్ మనస్సాక్షి లేని మనిషి.. చెత్త సినిమా తీశాడు.. మహేష్, ఎన్టీఆర్‌ని చూసి నేర్చుకోవాలి!
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ - ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరి మధ్య వ్యవహారానికి ఇప్పట్లో బ్రేక్స్ పడేలా కనిపించడం లేదు. ఛాన్స్ వచ్చిన ప్రతిసారీ ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో పవన్ మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో సోషల్‌మీడియాలో నెగిటివిటీని చూస్తూ ఊరుకోవద్దని ఎదురుదాడి చేయాలని పవన్ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పవన్ వ్యాఖ్యలు ఘర్షణలకు తావిచ్చేలా ఉన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు.ఇప్పుడు ప్రకాష్ రాజ్ సైతం వాటిపై రియాక్ట్ అయ్యి షాకింగ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

మనసాక్షి లేదు.. చెత్త సినిమా..
ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి మనసాక్షే లేదని.. అభిమానులను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.మనసాక్షి లేని ఇలాంటి దొంగల గురించి తాను మాట్లాడలేనని చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి సినిమాలకి హైప్ క్రియేట్ చేస్తున్నారని.. చెత్త సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇది నమ్మక ద్రోమం కాదా?. 'హరిహర వీరమల్లు' చిత్రానికి అసలు టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచాలి. సినిమాలో కథ ఉందా?.. నిజాయతీ ఉందా.. ఐదేళ్లు ఎందుకు లేట్ అయిందని ప్రశ్నించారు.
పవన్ చేతగానితనంతో ప్రొడ్యూసర్‌కి ద్రోహం చేశారని.. కథ మార్చేశారని.. రాజకీయ సిద్ధాంతాల్ని బలవంతంగా దూర్చేశారని ప్రకాష్ రాజ్ అ వ్యక్తం చేశారు. చివర్లో సినిమా కోసం ప్రచారం చేసినట్లుగా షూటింగ్‌కి కరెక్ట్‌గా వస్తే సినిమా ఎప్పుడో పూర్తయ్యేదని వ్యాఖ్యానించారు. హరిహర వీరమల్లు' చూశాక తాము మోసపోయామని పవన్ ఫ్యాన్స్ బాధపడుతున్నారన్నారు. స్టేజ్ మీద రెచ్చగొట్టేలా ఆ మాటలేంటని.. గతంలో ఓ సినిమా ఫంక్షన్‌లో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. హీరోలంతా బాగానే ఉంటాం మాకోసం మీరూ మీరూ కొట్టుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు.
జనాలు మూర్ఖులు కాదని అన్నారు ప్రకాష్ రాజ్. పవన్ వల్లే ఓ డైరెక్టర్ వెళ్లిపోతే మరొకరి తెచ్చుకున్నారని.. ఆయన్నైనా సరిగ్గా డైరెక్షన్ చేయనివ్వకుండా.. కథలో వేలు పెట్టారని ఆరోపించారు. ఇష్టం వచ్చినట్లు సినిమా తీసేస్తే చూడటానికి ప్రేక్షకులు పిచ్చోళ్లు కాదని చెప్పారు. తనది కోపం కాదని ఆవేదన అని.. తాను పాలిటిక్స్ గురించి బయట మాట్లాడతాను కానీ సినిమాల్లో మాట్లాడనని.. తమ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దకూడదని తెలిపారు.
ఇక గతంలో సైతం ప్రకాష్ రాజ్ పలు ఇంటర్వ్యూ లలో పవన్ కళ్యాణ్ పై ఇదే రీతిలో కామెంట్స్ చేశారు. సనాతన ధర్మం, హిందీ భాష సహా పలు అంశాలలో వీరి మధ్య విభేదాలు వచ్చినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కానీ జనసేన నేతలు కానీ ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల పట్ల స్పందిస్తారో లేదో చూడాలి.
-
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు" -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
నా కథను మానభంగం చేసేశారు..! -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?












Click it and Unblock the Notifications