ప్రభాస్ గురించి కన్నప్ప బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!
ప్రీతి ముకుందన్.. శ్రీవిష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది. మొట్టమొదటి సినిమాతోనే గ్లామర్‌తో పాటు కామెడీ టైమింగ్‌ను చూపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం " కన్నప్ప ". ఈ సినిమాలో నటించి అటు టాలీవుడ్, ఇటు పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. ఈ మూవీలో రుద్ర అనే పాత్రలో ప్రభాస్ కనిపించగా.. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్.. బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి సహా పలువురు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. మొదటి రోజు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఆ తర్వాత నెమ్మదించిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ అమ్మడు పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఫుల్ వైరల్ గా మారింది.

ప్రీతి మాట్లాడుతూ.. కన్నప్ప లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం అనుకోకుండా వచ్చింది. కొన్ని ఛాన్స్‌లు అదృష్టం వల్లే వస్తాయి.. కానీ ఆ అవకాశం వచ్చాక దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనమే నిరూపించుకోవాలి అని అన్నారు. ప్రభాస్ తో పనిచేయడం నిజంగా ఓ డ్రీమ్‌లా ఫీలయ్యా.. ఆయన ఉన్నచోటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. స్క్రీన్‌పై కనిపించే మేజిక్ రియల్ లైఫ్‌లోనూ ఉంటుంది. ఆయన అందరినీ గౌరవంగా చూస్తారు, ఎవరినీ తక్కువగా చూడరు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రీతి.. బాలీవుడ్ లో 'మైనే ప్యార్ కియా' అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కాబోతుంది.
మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలానే హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డితో 'స్పిరిట్'.. సలార్ 2, కల్కి 2 చిత్రాలలో నటించనున్నారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications