‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ

సాత్విక్ వర్మ, ప్రీతీ నేహా జంటగా, భాను దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ 'ప్రేమిస్తున్నా'. టీజర్, ట్రైలర్‌ల ద్వారా మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, నేడు (నవంబర్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమలో 'కోరిక' (Lust) అంశాన్ని బోల్డ్‌గా ప్రస్తావిస్తూ, దాని చుట్టూ అల్లిన ఈ విభిన్న కథాంశం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ
హీరో (సాత్విక్ వర్మ) తొలిచూపులోనే హీరోయిన్ (ప్రీతీ నేహా)తో ప్రేమలో పడతాడు. అయితే, అతని ప్రపోజల్ చాలా 'బోల్డ్'. నేరుగా "నీతో రొమాన్స్ చేయాలని ఉంది" అని తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. అతడి పద్ధతి నచ్చకపోయినా, ఇంట్లో సమస్యలు వస్తాయేమోనని భయపడి, ఒక షరతుతో హీరోయిన్ రొమాన్స్‌కు అంగీకరిస్తుంది. కానీ, తర్వాత అతడిని దూరం పెడుతుంది.

Preminsthunna Movie Review The Bold Take on Love vs Lust

అతని వెంట పిచ్చోడిలా పడటం వెనుక కారణమేంటి? ప్రీతిని మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాడు? వీరిద్దరి మధ్య గత సంబంధం ఏదైనా ఉందా? లండన్ వెళ్లాల్సిన ప్రీతికి చివరి నిమిషంలో తెలిసిన నిజం ఏంటి? హీరోది కోరిక కాదు, స్వచ్ఛమైన ప్రేమే అని నిరూపించుకునేందుకు ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ఎలా ఉందంటే..
ప్రేమ ఉన్నచోట కోరిక కూడా ఉంటుంది, దాన్ని తప్పు పట్టకూడదు అనే పాయింట్‌ను దర్శకుడు భాను చాలా ధైర్యంగా ఎంచుకున్నారు.ప్రథమార్థం ఎమోషనల్ సీన్‌తో మొదలు పెట్టి, వెంటనే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళుతుంది. హీరోయిన్‌ను ఫాలో అవ్వడం, రొమాన్స్ ఒప్పుకోవడం వంటి సన్నివేశాలు యూత్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు హీరో ప్రవర్తన కోపం తెప్పించినా, రానురాను అది కూడా ప్రేమలో భాగమే అనే భావన కలుగుతుంది.

సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్‌గా మారుతుంది. కొడుకు కోసం తల్లి (శారద) పడే తాపత్రయం, ప్రీతి ప్రేమ కోసం హీరో తాపత్రయపడే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక్కడే ఊహించని ట్విస్టులు రివీల్ అవుతూ కథనంపై ఆసక్తిని పెంచుతాయి.ప్రీ-క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నడిచే ఎమోషనల్ డ్రామా, ప్రేమ, కోరిక మధ్య తేడాను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. హీరో తీసుకునే నిర్ణయం, సంభాషణలు ఆకట్టుకుంటాయి.

నటీనటుల పనితీరు
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన సాత్విక్ వర్మ, పిచ్చి ప్రేమికుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని నటనలో 'అర్జున్ రెడ్డి' లేదా 'RX 100' ఛాయలు కనిపించినప్పటికీ, రొమాంటిక్ ,ఎమోషనల్ సీన్లలో రాణించాడు.ప్రీతీ నేహా హీరోయిన్‌గా చాలా అందంగా కనిపించడమే కాకుండా, తన పాత్ర పరిధి మేరకు నటనతో ఆకట్టుకుంది.

సాంకేతికత: పాటలు కథలో భాగంగా రావడం, నేపథ్య సంగీతం సినిమాకు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ , ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ముగింపు: 'ప్రేమిస్తున్నా' అనేది కాస్త బోల్డ్ అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, అది కేవలం నిజమైన ప్రేమలోని ఒక భాగం మాత్రమే అని చెప్పేందుకు చేసిన హృదయపూర్వక ప్రయత్నం. యూత్‌కు, ప్రేమలో ఉన్నవారికి తప్పకుండా నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది.

Rating: 3/5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+