ప్రియాంక బెడ్‌రూమ్ సీక్రెట్స్ లీక్: బయటపెట్టిందెవరో తెలిస్తే షాకవుతారు!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందన జంటలలో ఒకటిగా నిలుస్తుంది. పవర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట తరచుగా సోషల్ మీడియా ద్వారా లేదా ఇంటర్వ్యూల ద్వారా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిక్ జోనస్ ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని.. వారి బెడ్‌రూమ్ అలవాట్ల గురించి, నిద్రపోయే విషయంలో వారిద్దరి మధ్య ఉన్న భిన్నమైన అభిరుచుల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ విషయంలో మా ఇద్దరి మధ్య యుద్ధమే..
నిక్ జోనస్ ఇటీవల జేక్ షేన్ పాడ్‌కాస్ట్ 'థెరాపస్'లో మాట్లాడుతూ.. నిద్రపోయేటప్పుడు గది ఉష్ణోగ్రత విషయంలో ప్రియాంకకు, తనకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. నిక్ తనకు గది చాలా చల్లగా, గడ్డకట్టే చలిలో నిద్రపోవడం అంటే ఇష్టమని చెప్పారు. అయితే, ప్రియాంకకు మాత్రం వెచ్చని వాతావరణంలో నిద్రపోవడం ఇష్టమట. ఆమె గది ఉష్ణోగ్రతను ఎప్పుడూ 21°C నుండి 22°C (71°F - 72°F) మధ్య ఉంచడానికి ప్రయత్నిస్తుందని, ఆ వేడిలో నిద్రపోవడం తనకు ఒక పీడకలలా అనిపిస్తుందని నిక్ చెప్పుకొచ్చారు.

బెడ్ మీద కూర్చోను.. తినను!
కేవలం ఉష్ణోగ్రత విషయంలోనే కాకుండా, బెడ్ వినియోగం విషయంలో కూడా నిక్ కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారని వెల్లడించారు. "నా ఉద్దేశంలో బెడ్ అనేది కేవలం నిద్రపోవడానికి మాత్రమే. నేను బెడ్ మీద కూర్చోవడానికి, అక్కడ భోజనం చేయడానికి లేదా పుస్తకాలు చదవడానికి అస్సలు ఇష్టపడను. చివరికి బెడ్ మీద కూర్చుని టీవీ చూడటం కూడా నాకు నచ్చదు" అని నిక్ జోనస్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రియాంక అభిరుచి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
పక్కన కుర్చీ వేసుకుని మరీ..!
ప్రియాంకకు బెడ్ మీద రిలాక్స్ అవుతూ సినిమాలు చూడటం లేదా ఆహారం తీసుకోవడం అంటే చాలా ఇష్టమని నిక్ వెల్లడించారు. ఆమె అలా చేస్తున్నప్పుడు నిక్ ఆమె పక్కన బెడ్ మీద కూర్చోవడానికి నిరాకరిస్తారట. దానికి బదులుగా, గదిలో ఒక కుర్చీ వేసుకుని ఆమె పక్కన కూర్చుని కబుర్లు చెబుతారట. బెడ్ వేడెక్కడం తనకు అస్సలు నచ్చదని, అందుకే ఈ 'కుర్చీ ఫార్ములా'ను పాటిస్తున్నానని ఆయన నవ్వుతూ చెప్పారు. నిక్ పట్ల ప్రియాంకకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో, ఆమె అలవాట్ల కోసం నిక్ చేసే ఈ చిన్న చిన్న సర్దుబాట్లు చూస్తే అర్థమవుతుంది.
రాజీ తప్పదట..!
ప్రియాంక కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న ఈ చిన్నపాటి భేదాల గురించి మాట్లాడారు. తనకు నచ్చిన సినిమా చూస్తూ, ఇష్టమైన ఆహారం తినడం ఒక పర్ఫెక్ట్ డేట్ నైట్ అనిపిస్తుందని.. కానీ తన భర్తకు అది నచ్చదు కాబట్టి తాము ఆ విషయంలో రాజీ పడతామని ఆమె చెప్పారు. ఏది ఏమైనా, ఈ గ్లోబల్ కపుల్ మధ్య ఉన్న ఈ చిన్న చిన్న క్యూట్ గొడవలు, ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications