స్టార్ హీరోయిన్ ఒక్కసారి కూడా దీపావళి జరుపుకోలేదట..! ఎందుకో తెలుసా..?
దీపావళిని వివిధ కారణాల వల్ల జరుపుకుంటారు. కొందరు దీనిని లక్ష్మీదేవిని ఆరాధించే రోజుగా భావిస్తారు. మరికొందరు రావణాసురుడిని వధించిన శ్రీరామచంద్రుని విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.దీపావళిని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు.ఈ పండుగ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉంటారు.దీపావళి పండుగ మనసుల్లో ఆనందాన్ని నింపుతుంది. దీపావళి రోజు ఇళ్లను, ఆలయాలను దీపాలతో అలంకరిస్తారు. పటాకులు వెలిగించడం: ఈ రోజు పిల్లలు పెద్దలు అందరూ కలిసి పటాకులు వెలిగిస్తారు.
లక్ష్మీదేవిని ధనదేవతగా భావిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. ఆ రోజు నూతన వస్త్రాలు ధరించి, ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు.ఈ రోజు వివిధ రకాల మిఠాయిలు తయారు చేసి తింటారు. సినీ సెలబ్రిటీలు సైతం దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో, హీరోయిన్లు దీపావళిని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. కానీ హీరోయిన్ మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకోలేదట. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు.

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించిన ప్రియాంక చోప్రా చదువు పూర్తి కాగానే మోడల్ రంగంవైపు అడుగులు వేసింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్‌గా గెలవడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తమిళ చిత్రం 'తమిళన్' ద్వారా సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికి, బాలీవుడ్‌లోనే గుర్తింపు దక్కించుకుంది. అక్కడి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఘనత సాధించిన తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
'క్వాంటికో' వంటి సిరీస్‌తో హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. హాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుని ప్రియాంక చోప్రా సత్తా చాటింది. ఇదే సమయంలో వయస్సులో తనకన్నా వయస్సులో చిన్నవాడైనా హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. వారి జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప ఉంది. ప్రియాంక చోప్రా చిన్నప్పటి నుంచి దీపావళి సంబరాలకు దూరంగా ఉంటున్నారు. దీపావళికి టాపాసులు కాల్చే అలవాటు లేదట. ఇప్పటి వరకు ఆమె ఒక్కసారి కూడా బాణసంచా కాల్చలేదట. ప్రియాంక చోప్రా దీపావళి టాపాసులకు దూరంగా ఉండటమే కాకుండా టాపాసులు కాల్చకూడదని ప్రజలకు సలహాలిస్తుంటారు.పర్యావరణం కాలుష్యం అవుతుందని ప్రజలను కూడా టాపాసులు కాల్చవద్దని విజ్ఖప్తి చేబుతుంటారు.












Click it and Unblock the Notifications