బీచ్‌లో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ.. బర్త్ డే వీడియో వైరల్!
బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా... ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు ( జూలై 18 ) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న.. ఈ ముద్దుగుమ్మ వయసు పెరుగుతున్నా కానీ గ్లామర్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తూనే.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.
బాలీవుడ్ టూ హాలీవుడ్..
2000లో మిస్ వరల్డ్‌గా కిరీటం అందుకున్న ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో "అందాజ్", "డాన్", "ఫ్యాషన్", "బర్ఫీ", క్రిష్, "బాజీరావ్ మస్తానీ" వంటి సినిమాలతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకోగలిగింది. కాగా "ఫ్యాషన్" చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకొని తన టాలెంట్ ని నిరూపించుకుంది. ఆ తర్వాత అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో'తో హాలీడ్‌లో అడుగుపెట్టి.. "బేవాచ్", "ఇజ్ ఇంట్ ఇట్ రొమాంటిక్", "టెక్స్ట్ ఫర్ యు", "సిటాడెల్" లాంటి ప్రాజెక్టుల ద్వారా గ్లోబల్ ఫేమ్ దక్కించుకుంది.

నిక్ తో వివాహం..
2018లో ప్రియాంక తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్‌గా నిలిచింది. వయసు గ్యాప్, ఫేమ్, సంపదపై విమర్శలు వచ్చినా అవేమీ పట్టించుకోకుండా ఇద్దరూ తమ బంధాన్ని ప్రేమతో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వీరికి మల్తీ మేరీ చోప్రా జోనస్ అనే కుమార్తె ఉంది.
లిప్‌లాక్ వీడియో..
తాజాగా నిక్ జోనస్ తన భార్య ప్రియాంకతో బీచ్ లో ఉన్న ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో నిక్ ముందుగా "ఆమె లేకుండా..." అనే ఎమోజీతో పోస్టు చేశాడు. అనంతరం ప్రియాంక పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని లిప్‌లాక్ చేయడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ప్రేమ చూపించడంలో తప్పేంటి అంటుంటే, మరికొందరు పబ్లిక్‌లో ఇటువంటి ప్రవర్తన అవసరమా? అని విమర్శిస్తున్నారు.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎంబి 29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపొందుతున్నట్టు సమాచారం.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది












Click it and Unblock the Notifications