పబ్లిక్‌గా లిప్ లాక్ పెట్టిన స్టార్ హీరోయిన్..చూడలేక కళ్లు మూసుకున్న కూతురు
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించిన ప్రియాంక చోప్రా చదువు పూర్తి కాగానే మోడల్ రంగంవైపు అడుగులు వేసింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్‌గా గెలవడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తమిళ చిత్రం 'తమిళన్' ద్వారా సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికి, బాలీవుడ్‌లోనే గుర్తింపు దక్కించుకుంది.
అక్కడి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఘనత సాధించిన తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 'క్వాంటికో' వంటి సిరీస్‌తో హాలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. హాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుని ప్రియాంక చోప్రా సత్తా చాటింది. ఇదే సమయంలో వయస్సులో తనకన్నా వయస్సులో చిన్నవాడైనా హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. వారి జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు, సినిమా విషయాలను సైతం షేర్ చేస్తుంటుంది. తాజాగా ప్రియాంక చోప్రా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రియాంకచోప్రా, నిక్ జోనాస్ కలిసి లిప్ లాక్ పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి
ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్ జోనాస్ ఒకరినొకరు ప్రేమగా ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భర్త పుట్టిన రోజు కావడంతో ప్రియాంక తన పెదాలతో భర్త పెదాలను లాక్ చేసింది. ప్రియాంకచోప్రా తన భర్త నిక్ జోనాస్‌పై చూపించిన ప్రేమను కూతురు మాల్తీ మేరీ చూడలేకపోయింది. ఛీ ఇదేం పాడు పని అన్నట్లుగా తల్లి ప్రేమపూర్వకంగా తండ్రిని ముద్దు పెట్టుకోవడం చూడలేక నవ్వుతూ కళ్లు మూసుకుంది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications