కన్యత్వంలో ఏముంది.. ఒక్క రాత్రిలో అయిపోతుంది..స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.

మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.సరిగ్గా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో ఒకటి జరిగింది.ఓ హీరోయిన్ కన్యత్వం గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. కన్యత్వం అనేది ఒక రాత్రిలో ఖర్చు అయిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చేసింది మరెవ్వరో కాదు.. ప్రియాంక చోప్రా. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు.

Priyanka Chopra s shocking comments about women s virginity

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించిన ప్రియాంక చోప్రా చదువు పూర్తి కాగానే మోడల్ రంగంవైపు అడుగులు వేసింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడంతో ప్రియాంక చోప్రా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్‌గా గెలవడంతో ఆమెకు బాలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తమిళ చిత్రం 'తమిళన్' ద్వారా సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికి, బాలీవుడ్‌లోనే గుర్తింపు దక్కించుకుంది.

అక్కడి స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో ఘనత సాధించిన తర్వాత హాలీవుడ్ వైపు అడుగులు వేసింది.ఇదే సమయంలో వయస్సులో తనకన్నా వయస్సులో చిన్నవాడైన హాలీవుడ్ స్టార్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రేమలో పడటం, అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ జంటకు మలతీ మారియా చోప్రా జోనాస్ అనే పాప ఉంది.

ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు-రాజమౌళి చేస్తోన్న సినిమాలో నెగిటివ్ రూల్‌లో కనిపించడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ భామ మహిళల కన్యత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.చాలామంది వ్యక్తులు తమ భార్యలు వర్జీన్‌గా రావాలని కోరుకుంటారు. కానీ వర్జీన్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదు.వర్జీనీటీ అనేది ఒక్కరాత్రిలో పొతుందని.. దాని కోసం పెద్దగా పట్టించుకొవద్దని తమను అర్థం చేసుకొని, నచ్చిన విధంగా ఉండే మహిళ జీవిత భాగస్వామి రావాలని కోరుకొవాలని ప్రియాంక చోప్రా ట్విట్ చేసింది.ప్రియాంక చోప్రా వ్యాఖ్యల కొందరు మద్దతు తెలుపుతుంటే, మరి కొందరు ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+