'చిరంజీవికి బోర్ కొట్టేసింది'

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ఈ మధ్యే ప్రారంభం అయింది. ఈ సినిమా ను అనిల్ రావిపూడి తన గత చిత్రాల్లాగే ఫ్యూర్ అండ్ నీట్ ఎంటర్ టైనర్ గా తీస్తున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో వెంకీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్.. చిరూకు కూడా అదే రేంజ్ హిట్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక విశ్వంభర అనే మరో సినిమాలోనూ చిరంజీవి నటిస్తున్నారు. బింబిసార చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లోనూ ఓ సినిమా ఎనౌన్స్ చేశారు చిరంజీవి. ఇది కూడా పూర్తి కమర్షియల్ మూవీ అని పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది.

అయితే మొదటి నుంచీ చిరంజీవి ఎక్కువగా కమర్షియల్ మూవీస్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తన కెరీర్లో ఎక్కువ శాతం కమర్షియల్, మాస్ యాక్షన్ చిత్రాలే ఉంటాయి. చంటబ్బాయి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు, డాడీ లాంటి కొన్ని సినిమాలు అప్పుడప్పుడు చేసినా.. ఆయన మాత్రం ఎక్కువగా కమర్షియల్ రూల్ నే పాటిస్తూ వచ్చారు.

ఈ క్రమంలో నిర్మాత కోన వెంకట్ చిరంజీవి తనతో షేర్ చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన సినీ కెరీర్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలే చేశారని, ఇప్పుడు ఆయనకు బోర్ కొట్టిందని, విభిన్నమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నారని కోన వెంకట్ తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవే గతంలో తనతో చెప్పినట్లు కోన వెంకట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Producer Kona Venkat reveals interesting things about Chiranjeevi

ఓ సాదారణ పాత్రను తాను ఎందుకు చేయలేనని చిరూ తనను అడిగారని కోన వెంకట్ తెలిపారు. కొత్త సినిమాలు ఎప్పుడు చేయాలి? నాకు బోర్ వచ్చేస్తోందని చెప్పారని కోన వెంకట్ గలాటాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎప్పుడూ ఒకే లాంటి సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని చిరంజీవికి కోరిక ఉన్నట్లు కోన వెంకట్ అన్నారు.

కమర్షియల్ సినిమాలే కాకుండా ముమ్ముట్టీ, మోహన్ లాల్ చేస్తున్న మూవీస్ తరహాలో ఓ కొత్త స్టోరీస్ ను చేయాలని.. సాధారణ పాత్రలో తాను నటించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నట్లు కోన వెంకట్ పేర్కొన్నారు. విశ్వంభర, అనిల్ రావిపూడిల చిత్రాల తర్వాత మెగాస్టార్ మరిన్ని చిత్రాలు చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+