హీరోయిన్ల డ్రెసింగ్ పై టాలీవుడ్ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ నటుడు శివాజీ.. హీరోయిన్ ల వస్త్రధారణపై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ ల డ్రెసింగ్ విషయంలో టాలీవుడ్ నిర్మాత SKN సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పతంగ్ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
" ఏంటి మామూలు డ్రెస్ లో వచ్చావ్.. కొంచెం గ్లామర్ గా రావాల్సింది. అమ్మాయిలు.. హీరోయిన్లు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటే అదేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన అవసరం లేదు.. ఏదైనా మన మనసు మంచిగుండాలి తప్ప.. డ్రెసులో ఏముండదు.. అని టాలీవుడ్ నిర్మాత SKN షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు నటుడు శివాజీపై చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు మహిళలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం కావడంతో రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. శివాజీకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా హైదరాబాద్ లోని మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. అయితే ఇండస్ట్రీలో కొంతమందికి తనపై వ్యతిరేకత ఉందని అందుకే కుట్ర చేశారని వ్యాఖ్యానించారు.
ఇక ఇదే విషయంపై శివాజీ మాట్లాడుతూ.. తాను ఎవరికీ భయపడనని ఇక్కడ కాకపోతే మరోచోటుకు వెళ్లి బతుకుతానని స్పష్టం చేశారు. సినిమాలు కాకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతానని.. తాను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని తెలిపారు. అయితే ఈ క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు శివాజీ.. తాను అనవసరంగా సలహాలు ఇచ్చానని.. ఇకపై ఎవరికీ ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు.

తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై నటి అనసూయతోపాటుగా నాగబాబు, ప్రకాశ్ రాజ్ కూడా ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications