Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్‌కు ఎర్లీగా వచ్చిన దీపావళి
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం (Guntur Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. థమన్ సంగీతాన్ని సమకూరచిన ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
#DumMasala... Coming to you soon!! 🔥https://t.co/TbFQwJNmaN#Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @MusicThaman @ramjowrites #SanjithHegde @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th
— Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2023
ఇప్పటికే ఈ సినిమా టీజర్.. అదరగొట్టింది. మహేష్ బాబు స్టామీనాను చాటి చెప్పింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. ఈ టీజర్‌కు. మహేష్ బాబులోని మాస్ హీరోయిజాన్ని బయటపెట్టింది. తలకు ఎర్ర టవల్, నోట్లు బీడీ, మాసిన గెడ్డం, గళ్ల చొక్కాతో క్రేజ్ కా బాప్ అనిపించేలా చేశాడు.

గుంటూరు కారం పోస్టర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూసేలా చేస్తోన్నాయి. మాస్ లుక్‌తో కనిపించారు మహేష్ బాబు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ నటిస్తోన్నారాయన.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ ప్రొమో నేడు విడుదలయింది. ఈ ఉదయం సరిగ్గా 11:07 నిమిషాలకు ఈ ప్రోమోను రిలీజ్ చేసింది హారికా అండ్ హాసిని క్రియేషన్స్. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీన్ని పోస్ట్ చేసింద. ఎదురొచ్చే గాలి.. ఎగరేస్తోంది చొక్కాపై గుండి.. అనే లైన్‌తో ఉన్న ప్రోమో ఇది.

దమ్ మసాలా- బిరియానీ, ఎయ్ రా కారం అరకోడి, నీంబు సోడా- ఫుల్ బీడీ, గుద్ది పారేయ్ గుంటూర్ని.. అంటూ సాగుతుందీ సాంగ్. ఈ నెల 7వ తేదీన లిరికల్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ ఫ్యాన్స్‌కు దీపావళి పండగ ముందే వచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications