నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన పూరి జగన్నాథ్.. హీరో ఎవరంటే ?
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. కేవలం డైరెక్టర్ గానే కాకుండా రచయితగా, నిర్మాతగా టాలీవుడ్ లో ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. పూరి రాసే పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ అప్పీల్ లో హీరోలను చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అందరూ అంటుంటారు. అయితే ఇటీవల లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలలో ప్లాప్స్ అందుకున్నారు పూరి.
ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈరోజు ఈ వివరాలను పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని.. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో ప్రకటిస్తామని ఆ పోస్టులో రాసుకొచ్చారు. పూరి జగన్నాథ్ గత చిత్రాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అందుకే ఈ సినిమా కోసం కాస్త టైం తీసుకుని మరీ ఈ కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ గత సినిమాలకు భిన్నంగా కొత్త జోనర్‌లో ఈ మూవీ ఉండబోతుందని భావిస్తున్నారు.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ఉప్పెన, సైరా సినిమాల్లో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు విజయ్. ఇక దలపతి విజయ్ హీరోగా వచ్చిన " మాస్టర్ " సినిమాలో తన విలనిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు. రీసెంట్ గానే మహారాజా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది.
On this auspicious day of #Ugadi ✨🙏🏻
— Puri Connects (@PuriConnects) March 30, 2025
Embarking on an electrifying new chapter with a sensational collaboration 🔥
Dashing Director #PuriJagannadh and powerhouse performer, Makkalselvan @VijaySethuOffl join forces for a MASTERPIECE IN ALL INDIAN LANGUAGES ❤️🔥
Produced by Puri… pic.twitter.com/Hvv4gr0T2Z
-
తమన్నాకు గట్టిగా ముద్దుపెట్టిన అభిమాని.. వీడియో వైరల్.. -
66 ఏళ్ల వయసులో ఆ నటి తల్లి కాబోతుందా ??? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
OTT: దుమ్ములేపుతున్న కొత్త మూవీస్, ఈ వారం ఫుల్ లిస్ట్ ఇదే! -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
ఎయిర్ పోర్టులో త్రిషకు చేదు అనుభవం.. వీడియో వైరల్ -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా?












Click it and Unblock the Notifications