'దేవర' రికార్డును బీట్ చేయలేకపోయిన 'పుష్ప2'

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్లలో విడుదలైన పుష్ప2 సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా తొలిరోజు నుంచే రికార్డుల వేటను మొదలుపెట్టింది. తొలిరోజు రూ.180 కోట్ల నెట్ వచ్చింది ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీటిల్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచి, తర్వాత హిందీ నుంచి వచ్చాయి. ఇలాంటి రికార్డులను కొనసాగిస్తున్న పుష్ప2 ఒక్క విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర రికార్డును బీట్ చేయలేకపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నిర్మించిన దేవర సినిమా ఓవర్సీస్ లో తొలిరోజు 20వేల టికెట్లు అమ్ముడుపోయి కొత్త రికార్డును నెలకొల్పింది.

తెలుగులో తగ్గుతున్న కలెక్షన్లు
అయితే ఈ రికార్డును పుష్ప2 కూడా బీట్ చేయలేకపోయింది. ఓవర్సీస్ లో తొలిరోజు టికెట్లలో దేవర కంటే తక్కువే అమ్ముడుపోయాయి. సినిమా బాగుందనే టాక్ రావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి. రెండోరోజుకు కూడా పుష్ప2కు మంచి స్థాయిలోనే టికెట్లు బుక్ అవుతున్నాయి. బుక్ మై షోలో బుక్ అవుతున్న టికెట్లే ఇందుకు నిదర్శనం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బెనిఫిట్ షోతోపాటు తర్వాత రోజు నుంచి మల్టీప్లెక్స్, థియేటర్ టికెట్లు కూడా భారీగా ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా వెనుకంజ వేస్తున్నారు.

pushpa 2 movie not beat the devara record

వారం రోజులకు రూ.700 కోట్ల గ్రాస్
వారం రోజులకు రూ.700 నుంచి రూ.800 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను పుష్ప2 వసూళ్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సినిమా లాంగ్ రన్ లో బాహుబలి2 రికార్డును బద్దలు కొడుతుందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సి ఉంది. సినిమా టికెట్ ధరలు అత్యధికంగా ఉన్నాయని, ఈ ధరలమీద సులువుగానే బాహుబలి2 రికార్డును బద్దలు కొడుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం లాంగ్ రన్ లో అంత కలెక్షన్లు వస్తాయా? లేదా? అనేది చూడాల్సి ఉందని, సోమవారం నుంచి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్లను బట్టి ఆధారపడివుంటుందంటున్నారు. నిర్మాతలు మాత్రం పుష్ప2 రూ.2వేల కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+