విడుదలకు ముందే 'పుష్ప2' అదిరిపోయే రికార్డు.. ఇండియాలో ఫస్ట్‌మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్‌కు ఇది సీక్వెల్ గా వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా, ఫాహద్ ఫజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు ఐదోతేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాలకన్నా ఎక్కువ ఉత్సుకతతో ఉన్నారు. ఈ సినిమా రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందా? అంటూ ఎదురుచూస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 6 భాషల్లో
నిర్మాతలు ప్రపంచవ్యాప్తంగా పుష్ప2ను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగారు ఆరు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో 11,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతోంది. ఇంతవరకు భారతదేశానికి చెందిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో విడుదల కాలేదు. విడుదలరోజే రికార్డులను నెలకొల్పుతున్న పుష్ప2 విడుదలైన తర్వాత మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. మొత్తం 11,500 స్క్రీన్స్ లో ఇండియాలో 6,500 స్క్రీన్స్, విదేశాల్లో 5,000 స్క్రీన్స్ లో విడుదలవుతోంది.

బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమా
బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్న పుష్ప2 కలెక్షన్ల విషయంలో ఎదురులేకుండా దూసుకువెళుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ వార్తతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు అంచనాలను పెంచేశాయి. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న నాలుగో సినిమా ఇది. ఇంతకుముందు ఆర్య, ఆర్య2, పుష్ప1 రాగా, ఇప్పుడు పుష్ప2 రాబోతోంది. కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన విషయాలను చిత్ర యూనిట్ పంచుకుంటుండటంతో రోజురోజుకు సినిమాపై ఆసక్తి పెరగడంతోపాటు అంచనా కూడా పెరుగుతోంది.












Click it and Unblock the Notifications