Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెన్షన్‌లో సుకుమార్: అనుకున్నట్లుగా రాని పుష్ప2... నిర్మాతల డైలమా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం పుష్ప2. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు ఐదోతేదీన 11,500 స్క్రీన్లలో విడుదల చేయబోతున్నారు. మొదటి నుంచి వాయిదాలమీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు దాదాపుగా ఈ సినిమా పూర్తిచేసుకుంది. ప్రత్యేక గీతం షూటింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్న తరుణంలో దర్శకుడు సుకుమార్ మరో బాంబు పేల్చారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆయన అనుకున్నట్లుగా రాలేదని, దీంతో అసంతృప్తిగా ఉన్న సుకుమార్ మళ్లీ రీషూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సుకుమార్ అంటేనే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఇంటిలిజెంట్ డైరెక్టర్ అని పేరు. సినిమాకు ఎంతో కష్టపడతారు. ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తారు. ఎంతైనా లెక్కల మాస్టారు కాబట్టి ఆయన లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. ఈ సినిమా కూడా భారీ హిట్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ గా తిరుగులేని హోదా వస్తుంది. అయితే పుష్ప మొదటి భాగం తెలుగులో హిట్ అవలేదు. కేవలం యావరేజ్ గా మాత్రమే నిలిచింది. కొన్నిచోట్ల సినిమా కొనుగోలు చేసినవారు నష్టపోయారు. హిందీలో మాత్రం సూపర్ హిట్ అయింది. వారికి బాగా నచ్చింది. రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

pushpa2 director Sukumar in tension due to movie didn t come out as planned

హిందీలోనే అంచనాలు ఎక్కువ
పుష్ప2పై కూడా తెలుగులోకన్నా హిందీలోనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని వస్తోంది. సినిమా బాగుందనే టాక్ వస్తే సులువుగానే రూ.వెయ్యి కోట్లు సాధించడానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు, ట్రేడ్ పండితులు అంటున్నారు. మళ్లీ రీషూట్ అంటే ఖర్చవుతుంది.. నటుల కాల్షీట్లు అవసరమవుతాయి.. వారికి రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుంది.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి.. ఎడిటింగ్ ఉంటుంది.. ఇలా ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు ఎంత బడ్జెట్ మళ్లీ కేటాయిస్తారో చూడాలి. ఏదేమైనప్పటికీ పుష్ప2కు మాత్రం ఏ సినిమాకు ఎదురవనంత అవాంతరాలు మాత్రం ఎదురవుతున్నాయి. చివరకు ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+