'పుష్ప2' ఐటం సాంగ్‌... అదిరిపోయే స్టెప్ వేసిన శ్రీలీల.. రిలీజ్ చేసిన నిర్మాతలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప2. దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న ఐటం సాంగ్ ను చిత్రీకరిస్తోంది. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లపై భారీగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా? అంటూ బన్నీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకన్నా హిందీ బెల్టు ప్రాంతాల్లో ఈ సినిమాపై అత్యంత ఆసక్తి నెలకొంది.

చివరకు శ్రీలీలను ఎంపిక చేసిన సుకుమార్
పుష్ప1లో ఐటం సాంగ్ చేసిన సమంతకు ఆ సినిమా హీరోకన్నా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. సుకుమార్ సినిమాల్లో ఐటం సాంగ్ అంటే అంత ప్రత్యేకత ఉంటుంది. అందులో నటించే హీరోయిన్ హీరోను కచ్చితంగా డామినేట్ చేస్తుంది. సమంత ఒలకబోసిన హావభావాలు, ఆరబోసిన అందాలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సమంత ఇలాంటి ఐటం సాంగ్ చేస్తుందా? అంటూ ఒకరకంగా అందరూ షాక్ అయ్యారు. అంతకుమించిన ఐటం సాంగ్ తీయాలనే పట్టుదలతో ఉన్న దర్శకుడు సుకుమార్ ఎంతోమంది హీరోయిన్లను సంప్రదించారు. చివరకు శ్రద్ధాకపూర్ అనుకున్నారుకానీ ఆమె భారీ పారితోషికం అడగడంతో చివరకు శ్రీలీలను ఎంపిక చేశారు.

Pushpa2 film unit has released Sreeleela item song photo

శ్రీలీల పక్కన డ్యాన్స్ వేయడం చాలా కష్టం
శ్రీలీల డ్యాన్స్ పరంగా బ్రహ్మాండంగా చేస్తుంది. హీరోలు కూడా ఆమె పక్కన డ్యాన్స్ వేయలేరు. దీంతో సుకుమార్ ఎంపిక సరైందే అని అభిమానులు అంటున్నారు. శ్రీలీల పక్కన అల్లు అర్జున్ ఏవిధంగా డ్యాన్స్ చేస్తాడా? అనే ఉత్కంఠ మొదలైంది. సమంతను మించి శ్రీలీల పాపులారిటీ తెచ్చుకుంటుందా? లేదా? అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యేవరకు ఆగాల్సిందే. ఈ చిత్ర యూనిట్ ఐటం సాంగ్ లో శ్రీలీల నటిస్తోందంటూ ఒక డ్యాన్స్ స్టెప్ కు సంబంధించిన ఫొటోను అధికారికంగా విడుదల చేసింది. దీన్ని చూసినవారు అల్లు అర్జున్ కు ఆమె పక్కన కష్టమేనని, చెమటలు పట్టించడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శ్రీలీల స్టిల్ చూసినవారంతా స్టన్ అవుతున్నారు. ఈ పాట కూడా దేశాన్ని ఒక ఊపు ఊపేయడం ఖాయమనే అంచనాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+