Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాత్రూంలో పాట రికార్డు.. అందుకే ఇప్పటికీ రికార్డే!

కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసమే కాకుండా వాటిలో ఉన్న కళాత్మకత, కృషి కారణంగా చరిత్రలో నిలిచిపోతాయి. 1960లో వచ్చిన 'ముగల్-ఎ-ఆజమ్' అలాంటి ఒక అపురూపమైన సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా.. నేటికీ క్లాసిక్ సినిమాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక పాట గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ పాటను షూట్ చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అదే 'ప్యార్ కియా తో డర్నా క్యా' పాట.

ఒక పాట కోసం కోటి రూపాయలు..
ఈ బ్లాక్‌బస్టర్ చిత్రంలో మధుబాల, దిలీప్ కుమార్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో వచ్చిన 'ప్యార్ కియా తో డర్నా క్యా' పాట అత్యంత ఖరీదైన పాటగా చరిత్రకెక్కింది. ఆ రోజుల్లో అంటే 1960లో ఒక పాట కోసం ఏకంగా ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టారంటే నమ్మశక్యం కాదు. ఆ రోజుల్లో ఒక సినిమా మొత్తం బడ్జెట్ లక్షల్లోనే ఉండేది.

Pyar Kiya To Darna Kya Iconic Song Recorded in a Bathroom

బాత్రూంలో రికార్డింగ్.. 105 సార్లు రచన
ఈ పాట కోసం జరిగిన కృషి అసాధారణమైనది. గీత రచయిత షకీల్ బదాయూని ఈ పాటను 105 సార్లు రాసిన తర్వాత కానీ ఫైనల్ చేయలేదట. సంగీత దర్శకుడు నౌషాద్ ఈ పాటను పాడించడానికి ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ను ఎంపిక చేసుకున్నారు.అయితే ఈ పాట రికార్డింగ్ కోసం వారు ఒక వినూత్న పద్ధతిని అనుసరించారు. ఆ సమయంలో ఆధునిక ఎకో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో, వారు ఒక పెద్ద బాత్రూంలో ఈ పాటను రికార్డ్ చేశారు. దీనివల్ల పాటలో కావలసిన ఎకో ఎఫెక్ట్ సహజంగా వచ్చింది. ఈ టెక్నిక్ ఆ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది.

మధుబాల నటన, అందం
ఈ పాటలో మధుబాల అందం, ఆమె అద్భుతమైన నృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఆమె నటనకు ముగ్ధులైన షూటింగ్ సిబ్బంది, లైట్‌మెన్, మరియు నటులు కూడా ఆమె అందం చూసి ఆశ్చర్యపోయేవారని చెబుతుంటారు.'ముగల్-ఎ-ఆజమ్' సినిమాకు కె. ఆసిఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1960 ఆగస్టు 5న విడుదలైంది. ఈ సినిమా ఒక అద్భుతమైన కథ, నటన, సంగీతం ఉంటే సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని నిరూపించింది. అందులో ఈ పాట కూడా ఒక చరిత్రగా మిగిలిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+