ఆ పార్ట్‌ దురద పెడితే నాకు చెప్పు.. ఆ తెలుగు హీరో చండాలం

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమిట్‌మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

తాజాగా స్టార్ బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రాధిక ఆప్టే‌కు హిందీతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ..ఓ తెలుగు హీరో నాతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. నిజానికి అతనితో నాకు అంతగా పరిచయం కూడా లేదని, ఎలివేటర్‌లో వెళ్తున్న సమయంలో నాతో పాటు హీరో మాత్రమే ఉన్నాడు.

Radhika Apte Reveals Sexual Harassment by a Telugu Hero in an Elevator

ఆ సమయంలో అతను చనువుగా మాట్లాడుతూ..ఎప్పుడైనా మీ బ్యాక్ దురద పెడితే నన్ను పిలవండి అంటూ అసభ్యంగా మాట్లాడాడు. దీంతో వెంటనే నాకు కోపం వచ్చి అతనిపై ఫైర్ అయ్యాను. పెద్ద గొడవ చేశారు. దీంతో అతను అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు మాత్రం ఆమె వెల్లడించడానికి ఇష్టపడలేదు.

రాధిక ఆప్టే ఇలా తెలుగు హీరోల మీద కామెంట్ చేయడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఆమె ఓ తెలుగు హీరోపై ఆరోపణలు చేసింది. ఓ తెలుగు హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని..దాంతో తెలుగులో సినిమాలు చేయడం మానేశానని రాధిక ఆప్టే గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరోసారి తెలుగు హీరోపై అలాంటి కామెంట్సే చేసింది రాధిక ఆప్టే. దీంతో రాధిక ఆప్టే తెలుగులో ఏ హీరోలతో పని చేసిందా..ఆమె ఎవరి మీద ఈ కామెంట్స్ చేసి ఉంటుందా అని వెతికే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+