"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని"
దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్లకుపైగా సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో హిట్లు, మరెన్నో సూపర్ హిట్లు, అంతకుమించిన బ్లాక్ బస్టర్ లు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో ఒకరు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేశ్, నాగార్జున ఇలా అనేక మంది స్టార్ హీరోలకు కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్ని అందించారు. ఆ తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలను చిత్ర సీమకు పరిచయం చేశారు. అంతేకాక ఎంతో మంది హీరోయిన్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల్లో రాఘవేంద్ర రావు ఒకరు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తున్న కిస్సిక్ బ్యూటీ శ్రీలీల ను కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేశారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రాన్ని గౌరి రోనంకి తెరకెక్కించినా దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం రాఘవేంద్ర రావుదే. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ శ్రీలీలకు మాత్రం భారీగా ఆఫర్స్ వచ్చాయి. మాస్ మహారాజ రవితేజ తో ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం, పుష్ప 2: ది రూల్, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల.
20 ఏళ్ల క్రితం మీ అమ్మ కనిపించి ఉంటే ముందు తననే హీరోయిన్ చేసేవాణ్ణి
— AVM (@AvmNews7) March 9, 2026
- దర్శకుడు రాఘవేంద్ర రావు pic.twitter.com/YjdZweLl49
అయితే తాజాగా శ్రీలీలపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. శ్రీలీల ఇండస్ట్రీకి పరిచయం గురించి మాట్లాడుతూ రాఘవేంద్ర రావు కీలక కామెంట్స్ చేశారు. ముందు తన వద్దకు శ్రీలీల మదర్ వచ్చారు. అప్పుడు ఆమెతో.. 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని చూసుంటే మిమ్మల్నే హీరోయిన్ చేసేవాణ్ణి అని చెప్పాను. ఆమె కొంచెం సీనియర్ నటి వైజయంతి మాల లాగే ఉంటుంది.. అని రాఘవేంద్ర రావు అన్నారు. ఆయన స్టేజీపైనే ఈ కామెంట్స్ చేశారు. అప్పడు శ్రీలీల కూడా ఆయన పక్కనే ఉంది. ఈ మాటలు విన్న శీలీల తల్లి ఒక్కసారిగా నవ్వుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications