ఆ యాంకర్ తో జక్కన్న జింతాక్ జింతాక్.. వీడియో లీక్.. బుద్ధిమంతుడు అనుకుంటే..!
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలు ఒకదాని మించి మరోటి ఉంటాయి. ఇప్పటివరకు 12 సినిమాలు తీస్తే అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక బాహుబలి సిరీస్ తో యావత్ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయగా.. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచాన్ని ఊపేశారు. ఇక ఆయన సినిమా కోసం పడే తపన మామూలుగా ఉండదు. అందుకే జక్కన్న ఒక్కో సినిమాకు దాదాపు 2-3ఏళ్లు తీసుకుంటారు. ఇక ఆయనకు డైరెక్షన్ మాత్రమే కాదు యాక్టింగ్ అన్నా కూడా ఇష్టమే.. అందుకే ఆయన సినిమాల్లో ఏదో మూల కనిపిస్తూనే ఉంటారు. గెస్ట్ రూల్స్ లోనూ కనిపించి ఆయనలోని స్కిల్స్ చూపిస్తుంటారు.

అయితే దర్శకధీరుడు రాజమౌళికి చెందిన పాత వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ తో రాజమౌళి కనిపించారు. అంతేకాదు ఈ వీడియోలో వాళ్లిద్దరి మధ్య లవ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు నటించారోనని ఆరా తీస్తున్నారు.
Whatttt!!! Rajamouli and rashmi ideppudu jarigindi 😭 pic.twitter.com/nHM2LwyuCI
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 18, 2025
విక్రమార్కుడు సినిమా సమయంలో 'యువ' అనే తెలుగు సీరియల్ ప్రసారం అయ్యేది. ఆ సీరియల్లో రష్మీ రేడియో జాకీ పాత్రలో నటించారు. అయితే విక్రమార్కుడు ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి.. ఈ సీరియల్లో గెస్ట్ రోల్ లో యాక్ట్ చేశారు. ఇందులో ఆయన రష్మీతో కలిసి నటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియో చూసేయండి.












Click it and Unblock the Notifications