రాజమౌళికి బాగా నచ్చిన మహేష్‌బాబు సినిమాలు రెండే
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబును హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా తీయబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎస్.గోపాల్ రెడ్డి దీన్ని రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో రాజమౌళి ఈ సినిమాను తీయనున్నట్లు చెబుతున్నారు. అందుకే మహేష్ బాబును హాలీవుడ్ హీరోలకన్నా ధీటుగా తయారుచేస్తున్నారు. దీనిపై ఇప్పటికే మహేష్ బాబు శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌలి ఏఐ నేర్చుకుంటున్నారు. తాను నేర్చుకుంటున్న విషయాలను తన టీంతో పంచుకుంటున్నారు.
ఆ రెండు సినిమాలు బాగా నచ్చాయి
ఏ దర్శకుడికైనా ఒక హీరోకు సంబంధించిన సినిమాల్లో అన్నీ నచ్చాలనే నిబంధన లేదు. కొన్ని సినిమాలు కచ్చితంగా నచ్చుతాయి. అలా రాజమౌళికి మహేష్ బాబు సినిమాల్లో బాగా నచ్చినవి రెండు ఉన్నాయి. అవి ఒక్కడు, పోకిరి. ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు తనను తాను కొత్తగా చూపించుకున్నారని, ఈ సినిమాల్లో కొత్తగా కనిపించాడని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు. వీటిల్లో సరికొత్త మహేష్ బాబును చూశానని, ఏ పాత్రనైనా అవలీలగా పోషింగల సత్తా మహేష్ బాబుకు ఉందని ఆయన కొనియాడారు.

సంక్రాంతికి ప్రెస్ మీట్
మహేష్ బాబు అభిమానులు రాజమౌళి ఎటువంటి అప్ డేట్ ఇవ్వడంలేదంటూ విసుగ్గా ఉంటున్నారు. అయితే సంక్రాంతికి ప్రెస్ మీట్ పెట్టి సినిమాకు సంబంధించిన వివరాలు తెలియజేసే అవకాశం ఉందంటున్నారు. ఆఫ్రికన్ అడవుల్లో సినిమా తీయనున్నారని, ఫారెస్ట్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకోబోతోందని, ఇంతవరకు హాలీవుడ్ లో కూడా రానివిధంగా ఈ సినిమాను రాజమౌళి పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే మహేష్ బాబు హాలీవుడ్ హీరో అయినట్లేనని, ఇంగ్లిషు సినిమాలే చేస్తారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడా? అనేదే అత్యంత ఉత్కంఠగా సినీ పరిశ్రమలోను, అభిమానుల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications