ఆమెను మాత్రం నా సినిమాల్లోకి తీసుకోను: రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొని భారీ అడ్వెంచర్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబుతో తీయబోయే సినిమా బిగ్ అడ్వెంచర్ గా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాజమౌళి సినిమాలో హీరోయిన్లు ప్రత్యేకంగాకనిపిస్తారు.
తనకు ఇష్టమైన హీరోయిన్ తో రాజమౌళి ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమె ఎవరో కాదు.. నిత్యామీనన్. ఆమె అంటో రాజమౌళికి ఎంతో ఇష్టం. తన యాక్టింగ్ స్టైల్ బాగుంటుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మీ సినిమాలో ఎందుకు పెట్టుకోరు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిత్యామీనన్ హైట్ చాలా తక్కువగా ఉంటుందని, తాను పనిచేసే హీరోలంతా బాగా ఎత్తుగా ఉంటారని, దానివల్ల కాంబినేషన్ సరిగా సెట్ అవదని చెప్పాడు. ఈ కారణంతోనే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

మహేష్ బాబుతో తీయబోయే సినిమాకు సంబంధించిన అన్ని పనులు పూర్తికావస్తున్నాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని చిత్రయూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. అటవీ నేపథ్యంలో హీరో చేసే సాహసాలతో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కేఎల్ నారాయణ దీన్ని నిర్మించనున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తిగా సిద్ధం చేశారు.












Click it and Unblock the Notifications