ఎన్టీఆర్ తో స్నేహం వల్ల పైకి వచ్చిన నటులు!
జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు గురించి దేశవ్యాప్తంగా ఎవరికీ పరిచయం అవసరంలేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు. వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వస్తోన్న తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు. ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో ఉన్న జూనియర్ అందుకు తగ్గట్లుగా తన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే త్వరలో ఓ సినిమా చేయబోతున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం చేయడంవల్ల బాగా పాపులర్ అయిన నటులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు రాజీవ్ కనకాల కాగా, మరొకరు రోలర్ రఘు. రాజీవ్ కనకాలతో తారక్ ఎంత స్నేహంగా ఉంటారో మనందరికీ తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి వీరి స్నేహం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటి రెండు సినిమాలు మినహా అన్ని సినిమాల్లో రాజీవ్ నటించాడు. తారక్ సినిమాల్లో రాజీవ్ కనకాల కోసం ప్రత్యేకమైన పాత్రను దర్శకులు డిజైన్ చేస్తారు. చిన్న క్యారెక్టరైనా కచ్చితంగా ఉండి తీరుతుంది.

అలాగే రోలర్ రఘుకు జూనియర్ ఎన్టీఆర్ తో ఆది చిత్రంనుంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు మినహా చిన్న క్యారెక్టరైనా రఘుకు కచ్చితంగా ఉండితీరుతుంది. చిన్న క్యారెక్టరైనా ఉండేలా చూడండని ఎన్టీఆర్ రఘు కోసం దర్శకులను కోరేవాడు. ఆయన కోరినట్లే దర్శకులు కూడా పాత్రను ఇచ్చేవారు. సినీ పరిశ్రమలో రఘు కామెడీ విలన్ గా, కమెడియన్ గా గుర్తింపు పొందాడంటే తారక్ వల్లేనని అతని సన్నిహితులు చెబుతుంటారు. రాజీవ్ కనకాలైనా, రఘు అయినా పరిశ్రమలో స్థిరపడ్డారంటే జూనియర్ ఎన్టీఆర్ కారణం అని చెప్పొచ్చు. స్నేహం కోసం తమ హీరో ఎంతదూరమైనా వెళతాడని, అవసరమైనవారికి వెంటనే సాయం చేస్తాడని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications