రజినీ & కమల్ కొత్త మూవీ వీడియో రిలీజ్.. ఇక పూనకాలే !
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారత సినీ చరిత్రలో ఐదు దశాబ్దాలకు పైగా వెలుగొందుతున్న దిగ్గజ నటులు కమల్ హాసన్, రజనీకాంత్.. మళ్లీ 46 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్‌పై కనిపించనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమాకు సంబంధించి అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు అందిస్తుండగా.. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసింది. అందులో రజనీకాంత్, కమల్ హాసన్‌లు పోటాపోటీగా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. చివర్లో "ఎవరు హీరో?" అని ఇద్దరూ ప్రశ్నించడం హైలైట్ అని చెప్పాలి.

మొత్తానికి సస్పెన్స్ రివీల్..
కాగా గత కొంతకమలంగా వీరి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని చర్చ నడుస్తోంది. అయితే మొదట ఈ చిత్రానికి లోకేష్ డైరెక్షన్ చేస్తారని భావించారు. కానీ కూలీ ఫ్లాప్ కావడంతో ఆ మూవీ నుంచి తప్పుకున్నారని.. సుందర్ చేతికి దరకత్వ భాధ్యతలు అప్పగించారని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, కోట్లాది మంది ఎదురుచూస్తున్న 'కమల్ హాసన్ x రజనీకాంత్' చిత్రాన్ని ప్రకటించారు. సినిమా వర్కింగ్ టైటిల్ 'KHxRK'అని ఫిక్స్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ వీడియోలో ఇద్దరిలో మొదట ఎవరి రూమ్‌లోకి వెళ్లాలనే దర్శకుడు నెల్సన్ సందిగ్ధతను ప్రదర్శించడం, రెండు వేళ్లతో రాగాన్ని ఎంపిక చేసుకునే సంగీత దర్శకుడు అనిరుధ్ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాస్ట్యూమ్స్, బూట్లు, బెల్ట్, వాచీ, కళ్లద్దాల విషయాల్లో ఈ ఇద్దరు ఎవరికి వారే అనేలా మెప్పించారు. ఒకరికొకరు ఎదురుగా నిలబడే షాట్‌లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రజనీకాంత్ కారు కీ అందించడం, కమల్ హాసన్ డ్రైవింగ్ సీట్‌లో స్టైల్ గా కూర్చోవడం వంటివి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.












Click it and Unblock the Notifications