రజనీకాంత్ - జూనియర్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్

రజనీకాంత్ భారతదేశంలోనే సూపర్ స్టార్ గా చెలామణి అవుతున్నారు. త్వరలోనే కూలీ సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదేరోజు కూలీని కూడా విడుదల చేయాలనే యోచనలో నిర్మాత, దర్శకులున్నారు. అయితే తారక్ కు పోటీగా వద్దని, వారు ఆరోజు విడుదల చేయకపోతే మన సినిమా విడుదల చేయమని రజనీ వారికి చెప్పారు. అయితే ఈ రెండు సినిమాలు ఆరోజు విడుదల కావడం దాదాపుగా ఖాయమంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరగనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తారక్ వద్దనడంతో..
వాస్తవానికి గతంలోనే రజనీకాంత్, తారక్ కాంబినేషన్ లో ఓ సినిమ రావాల్సి ఉందికానీ మిస్ అయింది. మిర్చి, శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన కొరటాల శివ తన తర్వాత సినిమాగా జనతా గ్యారేజ్ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మోహనల్ లాల్ క్యారెక్టర్ కు రజనీకాంత్ ను తీసుకోవాలని కొరటాల భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వద్దన్నారు. రజనీ ఇమేజ్ వేరని, ఆయన్ను తక్కువ చేసినట్లవుతుందన్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర సినిమా మొదటి భాగంలో తారక్ ను డామినేట్ చేస్తుంది.

Rajinikanth and junior ntr combination missed block buster movie details here

పరిశ్రమలో ఎవరూ లేరు
తారక్ వద్దనడంతో అప్పటికే రజనీని కలిసి కథ చెబుదామని సిద్ధమైన రజనీకాంత్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మోహన్ లాల్ ను కలిసి కథ వినిపించగా ఆయనకు నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం, సినిమా పట్టాలెక్కడం, బ్లాక్ బస్టర్ అవడం జరిగిపోయింది. అలా తారక్, రజనీకాంత్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది. వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చుంటే కనుక అది మాములు రేంజ్ లో హిట్ అయ్యేది కాదని, సినీ చరిత్రలో రికార్డులను తిరగరాసేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. భవిష్యత్తులో కూడ వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశం కనపడటంలేదు. వీరిద్దరికి తగ్గ కథను సిద్ధం చేసే దర్శకుడు పరిశ్రమలో ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+