జూనియర్ ఎన్టీఆర్ తో పోటీకి వెళ్లొద్దని చెప్పిన రజనీకాంత్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి నేరుగా హిందీలో నటిస్తున్న చిత్రం వార్2. హృతిక్ రోషన్ మరో కథానాయకుడు. మల్టీస్టారర్ గా, భారీ యాక్షన్ అడ్వెంచర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కియారా అద్వానీ కథానాయిక. ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. యాక్షన్ సన్నివేశాలు చాలా రిచ్ గా దర్శకుడు తీర్చిదిద్దినట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా విడుదలవుతున్న రోజే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడు.
పోటీకి వెళ్లొద్దని రజనీకాంత్ చెప్పారు
ఏడాది క్రితమే ఆగస్టు 14న వార్ 2 విడుదలవుతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే కూలీ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యే దశకు రావడంతో తాము కూడా అదేరోజు సినిమాను విడుదల చేస్తున్న నిర్మాత, దర్శకులు ప్రకటించారు. అయితే హీరో రజనీకాంత్ దర్శకుడిని వారించారు. ఆరోజు జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉందని, వారు ఒకవేళ విడుదల తేదీని వాయిదా వేసుకుంటేనే అప్పుడు విడుదల చేయండి అని చెప్పారు. కానీ దర్శకుడు మాత్రం మొండిపట్టుదలగా అదేరోజు సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రజనీకాంత్ సైలెంట్ అయ్యారు. సినిమా ఎప్పుడు విడుదల చేసుకోవాలనేది నిర్మాత ఇష్టం మీద ఆధారపడివుంటుంది.

తమిళంలో వార్ 2కు థియేటర్లు దొరకవు
ఆగస్టు 14వ తేదీన ఈ రెండు సినిమాలు హోరాహోరీగా తలపడబోతున్నాయి. తమిళంలో వార్ 2కు థియేటర్లు దొరికే అవకాశం ఉండదు. తెలుగులో మాత్రం కూలీ సినిమాకు సరిపడా సంఖ్యలోనే థియేటర్లు దొరుకుతాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులమీద థియేటర్లు దొరకడం అనేది ఆధారపడివుంటుంది. అయితే సినిమా బాగుంటే మాత్రం ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. ఒకదానికి మంచి టాక్ వచ్చి, మరోదానికి మంచి టాక్ రాకపోతే, అందులోను కాస్తంత సినిమా బాగున్నప్పటికీ బాగున్న సినిమా దాన్ని డామినేట్ చేస్తుంది. రజనీకాంత్ కు జూనియర్ ఎన్టీఆర్ స్టామినా, క్రేజ్ గురించి తెలుసు. సినిమా బాగుందంటే దాన్ని ఆపేవారే ఉండరు. అందుకే ఏ సినిమాకు పోటీ లేకుండా విడుదల చేయాలని చెప్పారు. చూడాలి.. ఈ రెండు సినిమాల్లో ఏది నెంబర్ వన్ గా నిలుస్తుంది? ఎవరు జెండా ఎగరేస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications