హీరోయిన్‌తో ట్రైలర్ లాంచ్ చేయించిన ఏకైక హీరో అతనే..!
"రాజు గాని సవాల్" సినిమా ట్రైలర్‌ను అందాల హీరోయిన్‌లు డింపుల్ హయతి, రాశీ సింగ్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఘనంగా విడుదల చేశారు. లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లెలిజాల రవీందర్ స్వయంగా నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. రక్షా బంధన్ కానుకగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హీరోయిన్‌లు డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభంలో తనకు అవకాశం ఇచ్చిన బాపిరాజు గారికి కృతజ్ఞతలు తెలిపారు. "రాజు గాని సవాల్" ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయని, ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. నిర్మాత దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, రాశీ సింగ్, డా. భద్రం కూడా సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ, తమ సినిమాలో మధ్య తరగతి ప్రజల జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కుటుంబ సంబంధాలు, స్నేహితుల బంధాలను వాస్తవికంగా చూపించామని అన్నారు. కవాడిగూడలోని నిజమైన ప్రదేశాలలో చిత్రీకరించిన ఈ సినిమా ఒక క్లాసిక్ డ్రామాగా, మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, అతిథుల అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి, సంధ్య రాథోడ్, రవీందర్ బొమ్మకంటి తదితరులు నటించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా, రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి వంటి ప్రముఖ గాయకులు పాటలు పాడారు. "రాజు గాని సవాల్" ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications