మహిళలకు ఫ్రీ షోలు.. స్పెషల్ ఆఫర్ ఇచ్చిన మూవీ టీం !!
యువ జంట అఖిల్ రాజ్, తేజస్విని రావు జంటగా నటించిన చిత్రం "రాజు వెడ్స్ రాంబాయి". చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ మూవీ. సాయిలు కంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల తొలిసారిగా నిర్మాతగా వ్యవహరించారు. శివాజీ రాజా, అనిత చౌదరి, చైతూ జొన్నలగడ్డ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. కేవలం మౌత్ టాక్‌తో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ ప్రేమకథ ప్రేక్షకులను కట్టిపడేయడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ గుండెల్ని పిండేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. రాజు పాత్రలో అఖిల్ రాజ్.. అలాగే రాంబాయి పాత్రలో తేజస్విని రావ్.. టాలెంట్ చూపించారు. చైతూ జొన్నలగడ్డ సైతం తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్రలో అదరగొట్టారు. తొలి రోజు రూ.1.40 కోట్లు రాబట్టిన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రేక్షకులకు ఓ అద్భుతమైన కానుకను ప్రకటించింది. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళా ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈరోజు ( నవంబర్ 27, 2025 ) ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ కింద ఆంధ్రా, సీడెడ్ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో మహిళలు ఉచితంగా సినిమా చూడవచ్చు. ఇందుకు సంబంధించిన థియేటర్ల జాబితాను కూడా చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈ అవకాశం కేవలం ఈరోజు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
థియేటర్ల జాబితా ఇదే..
విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్
గుంటూరు: బాలీవుడ్
ఒంగోలు: గోపి
అనంతపురం: SV సినీ మాక్స్
కావలి: లత, మానస
రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్
నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్
కడప: రవి
రాయచోటి: సాయి
కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్
ఏలూరు: అంబికా కాంప్లెక్స్
తణుకు: శ్రీ వెంకటేశ్వర
మచిలీపట్నం: సిరి కృష్ణ
చిత్తూరు: గురునాథ్
హిందూపురం: గురునాథ్
కర్నూలు: ఆనంద్
తిరుపతి: జయ శ్యామ్
నంద్యాల: నిధి












Click it and Unblock the Notifications