గుండెల్ని పిండేసిన సినిమా భయ్యా.. ఇది మరో 'ఉప్పెన'..!

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఇప్పటి ట్రెండ్. ఇటీవల లిటిల్ హార్ట్స్, మహావతార నరసింహ.. ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే ఆ లిస్టులోకి తాజాగా రిలీజైన 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ చేరింది. నూతన నటీనటులతో ఈ మూవీ తెరకెక్కింది. సాయిలు కంపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పక్కా విలేజ్ నేపథ్యంలో జరిగే ఈ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ గుండెల్ని పిండేసిందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Raju Weds Rambai The New Uppena of 2025 Pure Village Love Magic

ఈ మూవీ ఉమ్మడి ఏపీ కాలంలో జరుగుతుంది. వరంగల్- ఖమ్మం మధ్య ఓ గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీలో రాజు పాత్రలో అఖిల్ రాజ్.. అలాగే రాంబాయి పాత్రలో తేజస్విని రావ్.. తమ యంగ్ టాలెంట్ చూపించారు. పాత్రల్లో ఇమిడిపోయి నటించారు. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ చూస్తే షాక్ అవుతారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ మొదటి రోజు రూ. కోటి రూపాయల కలెక్షన్స్ ను సంపాదించడం విశేషం. కథా బలం ఉంటే బాక్సాఫీస్ అయినా ఓటీటీ అయినా హిట్ ఖాయం అని మరోసారి ఈ మూవీ రుజువు చేసింది.

ఇక ఈ మూవీలో అఖిల్ రాజ్, తేజస్వి రావ్ లతో పాటు శివాజీ రాజా, చైతూ జొన్నలగడ్డ.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి సాయిలు కంభంపాటి దర్శకత్వం వహించాడు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ యదార్థ విలేజ్‌ లవ్‌ స్టోరీ అని స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+