అన్నం పెట్టే వారిని అలా చెప్పి మోసం చేయలేను - స్టార్ బ్యూటీ

రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ బ్యూటీగా ఎదిగింది. 'గిల్లి' అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేసిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగులో లాంఛ్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అలానే తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈ భామ ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేది.. అయితే ఇప్పుడు కొంచెం సన్నబడింది.

కాగా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను వివరిస్తూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా వేరే భాష హీరోయిన్లు లిప్ సింక్ కోసం డైలాగులు రాకపోయినా మేనేజ్ చేస్తూ ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ఈ పద్ధతిపై రకుల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పని చేసే ఇండస్ట్రీ పట్ల గౌరవం ఉండాలంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు సినీ వర్గాల్లో రచ్చ రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది.

rakul-preet-singh-shocking-comments-over-learning-new-languages-and-dubbing-for-films

లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షూటింగ్ సమయంలో భాష తెలియకుండా కేవలం 1 2 3 4 లేదా ABCD అని అంకెలు, అక్షరాలు చెప్పి తన డైలాగ్ లైన్లను పూర్తి చేయలేనని చెప్పారు. ఏ పరిశ్రమ అయితే మనకు అన్నం పెడుతుందో.. ఏ ప్రేక్షకులు అయితే మనకు అపారమైన ప్రేమాభిమానాలు అందిస్తారో వారికి కనీస గౌరవం ఇవ్వాలన్నారు. అందుకే అక్కడి భాషను నేర్చుకోవాలని రకుల్ స్పష్టం చేశారు. కేవలం డైలాగులు చెప్పడం కోసం కాకుండా.. పాత్రలో ఒదిగిపోవాలంటే భాషా మీద పట్టు అవసరమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ చిత్రాల్లో రాణిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అప్డేట్స్ అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+