రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి... భర్త ఏం చేస్తాడో తెలుసా?

అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ను అందుకుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. నటన, అందంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ కూడా వరుసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా రాణించింది.

ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో బాలీవుడ్ హీరో, ప్రొడ్యూసర్ అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ కూడా చేస్తున్నట్లు రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంటనే పెళ్లి చేసుకుందని అందరూ అనుకున్నారుకానీ కొన్నిరోజుల తర్వాతే తాము పెళ్లిచేసుకుంటామని రకుల్ చెప్పింది. తాజాగా ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు.

Rakul preeth singh marraige news latest update

వచ్చేనెల 22వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలికాలంలో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారే కాకుండా వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా నిలిచినవారంతా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని కూడా అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గోవాలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం జరగబోతోందని సమాచారం. వివాహం తర్వాత ముంబయిలో రిసెప్షన్ పార్టీని గ్రాండ్ గా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరి పెళ్లిపై రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి ప్రకటన చేయలేదుకానీ పలు ప్రాజెక్టులతో మాత్రం బిజీగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+