Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామ్‌చరణ్‌-ఉపాసన అరుదైన ఘనత :'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా..!!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ దంపతులు మరో అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ వీరిద్దరి ప్రత్యేకతను వివరిస్తూ కవర్ స్టోరీ ప్రచురించింది. సూపర్ కపుల్. వీరిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ నెట్టింట వైరల్ అవుతుంది.

కొద్ది రోజులుగా చరణ్ దంపతులు ముంబైలో ఉంటున్నారు. తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తాజాగా నిన్న శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‏నాథ్ షిండే ఇంటికి అతిథిగా వెళ్లారు. మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే వారికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ ఫుల్ స్టిల్ ఇచ్చారు. అందులో చరణ్ ఉపాసన, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తున్నారు. ఉపాసన సోఫాలో కూర్చోగా.. చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంటుంది. ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ప్రశంసలతో ముంచెత్తారు.

Ram Charan and Upasana Konidela couple have graced the cover of the esteemed Forbes magazine


వీరిద్దరూ మహారాష్ట్ర సీఎంని ఎందుకు కలిశారు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. తెలుగు హీరో అయిన రామ్ చరణ్ ఎక్కడో మహారాష్ట్ర సీఎం ఇంటికి అతిథిగా వెళ్లడం ఏంటి..? అక్కడ సీఎం ఇంటి ఆడపడుచులతో హిందూ పద్దతిలో ఆతిథ్యం అందుకోవడం ఆసక్తి కరంగా మారింది. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇక, ప్రఖ్యాత మేగజైన్ పైన టాలీవుడ్​ ఫస్ట్ కపుల్ అరుదైన ఘనత సాధిస్తూ స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ ప్రచురితమైన కవర్ పేజీ కధనం ఇప్పుడు వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+