అక్కకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన మెగా పవర్ స్టార్..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ " మన శంకర వరప్రసాద్ గారు". సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వగా.. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. కేథరిన్ ముఖ్య పాత్ర పోషించగా.. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చారు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.
అటు మాస్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తూ చిరు కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించారు. మొత్తానికి వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ విజయంతో చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా ఈ మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. కాగా ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మూవీ టీం వరుస ఇంటర్వ్యూలతో బిజిబిజీగా ఉంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సుస్మిత.. తన తమ్ముడు, హీరో రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని ఓపెన్ అయ్యారు.

సుస్మితా మాట్లాడుతూ..
తాను నిర్మాతగా ముందడుగు వేసి విజయం సోంతం చేసుకున్న కారణంగా.. చరణ్ తనకు ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని తెలిపారు సుస్మిత. నాన్నతో సినిమాను చాలా బాగా నిర్మించావని చరణ్ అన్నాడన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. అందుకే నీకు ఇప్పుడు చాలా దిష్టి తగులుతుంది కాబట్టి ఇది వేసుకో అని ఒక 'ఈవిల్ ఐ' (Evil Eye) బ్రేస్‌లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని ఆమె తెలిపారు. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "పెద్ది". ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా కీలక పాత్రల్లో జగపతిబాబు, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ స్టార్ క్యాస్టింగ్‌నే సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అలానే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ.
-
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications