రామ్‌చరణ్ వదులుకున్న కల్ట్ క్లాసిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు కథ వెళ్లాలంటే ఎంతోమందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకుంటుంటారు. అలా దాటుకొని వెళ్లిన కథ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తీర్చిదిద్దిన ఈ చిత్ర రాజం అద్భుతమైన ఫ్లాప్ ను మూటకట్టుకుంది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చి రోడ్డున పడేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆదుకోవడంతో దిల్ రాజ ఊపిరి పీల్చుకున్నారు. మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటినుంచి ఎవరికీ ఈ సినిమాపై అంచనాల్లేవు. అందుకు తగ్గట్లుగానే చివరకు జరిగింది.

ఏమేం సినిమాలు వదులుకున్నారో తెలుసా
తన కెరీర్ లో రామ్ చరణ్ కొన్ని కల్ట్ క్లాసిక్స్ ను వదులుకున్నాడు. కథలో మాస్ ఎలిమెంట్స్ లేవనే కారణంతో వీటిని వద్దనుకున్నాడు. అయితే వీటిని చేసుంటే రామ చరణ్ లోని అద్భుతమైన నటన బయటకు రావడానికి అవకాశం ఉండదని, ప్రతిసారీ అటువంటి అవకాశాలు రావనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆయన ఎటువంటి క్లాసికల్ సినిమాలను వదులుకున్నారో తెలుసుకుందాం.

ram charan missed cult classic movies details here

ఇవన్నీ క్లాసిక్స్ గా నిలిచాయి
మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ నటించిన ఓకే బంగారం తమిళంలో ఘనవిజయం సాధించడంతోపాటు తెలుగు, మళయాళంలో కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ తో సినిమా చేయాలని అతనికి మణిరత్నం ముందుగా కథ చెప్పారు. మాస్ ఎలిమెంట్స్ లేవని తిరస్కరించాడు. ఈ సినిమా మంచి క్లాసిక్ గా నిలిచింది. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా వదులుకున్నాడు. అప్పటికే వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న గౌతమ్ తో సినిమా వద్దనుకోవడంతో సూర్యతో తెరకెక్కి ఘనవిజయాన్ని అందుకొని క్లాసికల్ మూవీగా నిలిచింది.

ఆరెంజ్ ప్రభావం బాగా పడింది
నాని హీరోగా గౌతమ్ వాసుదేవ మీనన్ తో తెరకెక్కిన ఎటో వెళ్లిపోయింది మనసు కూడా రామ్ చరణ్ వద్దనుకున్నాడు. అయితే ఈ సినిమాకు ముందు విడుదలైన ఆరెంజ్ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో ప్రేమ కథ వద్దనుకొని దీన్ని తిరస్కరించాడు. చివరకు ఇది కూడా మంచి క్లాసిక్ అయింది. కరుణాకర్ దర్శకత్వంలో ప్రభాస్ చేసి డార్లింగ్ కూడా తిరస్కరించాడు. దర్శకుడు కథ చెప్పినప్పటికీ అప్పటికే రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకు ఒప్పుకొని ఉండటంతో ఇది చేయడానికి వీలుపడలేదు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అఖిల్ ఏజంట్ కూడా రామ్ చరణ్ వద్దకే రాగా చేయనని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+