రామ్ చరణ్ 'పెద్ది' మాస్ సీన్ లీక్.. ఫోటోలు వైరల్..

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌- బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'పెద్ది'. ఈ మూవీపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో సెన్సేషన్ అవుతోంది. తాజాగా పెద్ది షూటింగ్ నుంచి రామ్ చరణ్ మాస్ లుక్ ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోకి ఆయన వెళ్తున్న చిత్రాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. చేతిలో సంచితో కనిపించిన ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ దిల్లీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడి రాష్ట్రపతి భవన్ ముందు రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. తాజాగా ఈ లొకేషన్ నుంచి రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో చేతిలో సంచితో మాస్ లుక్ లో రామ్ చరణ్ ఉన్నాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో చెర్రీ లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ ప్లాఫ్ కావడంతో.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రామ్ చరణ్ ఫుల్ కసి మీద ఉన్నారు. ఆయన తాజాగా నటిస్తున్న పెద్ది చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,పోస్టర్స్, సాంగ్స్ కు ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల రిలీజైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్‌ ను సాధించింది. అంతేకాక ఈ ఏడాది అత్యధిక వ్యూస్ ను సాధించిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Ram Charan Peddi Mass Scene Leaked Photos Storm the Internet

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌ కుమార్ ఈ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం ఏఆర్‌ రెహమాన్ అందిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బుచ్చిబాబు వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+