గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి.. బుజ్జితల్లి 'క్లింకార' ఫేస్ చూశారా..!
మెగా ఇంటి మణిదీపం ఆ బుజ్జితల్లి 'క్లింకార'. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లింకార. కోట్ల మంది మెగా అభిమానులు క్లింకారను ఒక్కసారైనా చూడాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే తాజాగా ఉగాది పర్వదినం సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రధాన ఆకర్షణగా మెగా ప్రిన్సెస్ క్లింకార నిలిచింది. క్లింకార పింక్ డ్రెస్ లో నాయనమ్మ పక్కన కూర్చొని ముద్దు ముద్దుగా పూజ చేస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. క్లింకార పద్దతిగా అమ్మ, నాయనమ్మ పక్కన కూర్చుని పూజ చేసిన వీడియో చూసి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే క్లింకార పుట్టినప్పటి నుంచి క్లింకార ఫేస్ చూడాలని ఆశపడిన ఫ్యాన్స్ కు మాత్రం మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మెగా ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే మిగిలింది. ఈసారి కూడా క్లింకార ఫేస్ కనిపించకుండా.. జాగ్రత్త పడ్డారు. సైడ్ యాంగిల్స్ లో వీడియో తీశారు. అయినప్పటికీ కాస్త కనిపిస్తుండడంతో మెగాభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్, ఉపాసన కామినేనిల వివాహం 2012 జూన్ 14న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. పెళ్లయిన 11 ఏళ్లకు వీరికి పాప పుట్టింది. 2023 జూన్ 20న క్లింకార జన్మించింది. దీంతో మెగా ఇంట్లో సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ సమయంలో అభిమానులు సైతం పెద్ద ఎత్తున పండగలే జరిపారు. క్లింకార పుట్టగానే మెగా ఇంట పట్టలేని సంతోషం కనబడింది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల రిలీజైన పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ మూవీ గ్లింప్స్ శ్రీరామనవమి కానుకగా విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా పెద్ది చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.












Click it and Unblock the Notifications