తమన్ ను అన్ ఫాలో చేసిన రామ్ చరణ్..?.. ఆ ఒక్క పోస్ట్ కారణమా..!

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం 'గేమ్‌ ఛేంజర్‌' ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అనేక రకాలుగా ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేదని టాక్ వచ్చింది. భారీ బడ్జెట్‌ ఉన్నప్పటికీ సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్, పాటలు, కథ.. ఇలా ప్రతి క్రాఫ్ట్ లోనూ చిత్ర యూనిట్ ఫెయిల్ అయిందని అందుకే గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ బాంబ్ గా మిగిలిపోయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్.. పాటల ఫెయిల్యూర్‌కు కొరియోగ్రాఫర్, హీరోనే కారణం అన్నట్లుగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. తమన్ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాయి. ఫ్యాన్స్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సరిగ్గా ట్యూన్స్ కొట్టకుండా ఇతరులపైకి నెట్టేయడం ఏంటీ అని సోషల్ మీడియాలో మెగా అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.

Ram Charan Sparks Buzz After Unfollowing Music Director Thaman What s the Truth

ఈ క్రమంలో ఓ అభిమాని పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తన ఇన్ స్టా, ఎక్స్ ఖాతాల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను అన్ ఫాలో అయ్యారన్న వార్తను వైరల్ చేశాడు. దీంతో ఈ వార్త నెట్టింట ఒక్కసారిగా వైరల్ అయింది. చాలామంది మెగా ఫ్యాన్స్ ఈ వార్త నిజమేనని భావించారు. అయితే ఓ వార్తా ఛానల్ కు పూర్తి క్లారిటీ ఇచ్చింది రామ్ చరణ్ టీమ్. సోషల్ మీడియాలో తమన్‌ను చెర్రీ అన్‌ఫాలో అయ్యాడన్న వార్తలో నిజం లేదని.. ఎందుకుంటే ఆయనను ఎక్స్ లేదా, ఇన్‌స్టా గ్రామ్‌లో ఎప్పుడూ ఫాలో కాలేదని క్లారిటీ ఇచ్చింది. ఎక్స్, ఇన్‌స్టా లో చాలా తక్కువ మందిని రామ్ చరణ్ ఫాలో అవుతారని, వారిలో ఎక్కువమంది ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+