ఒక్క పాట.. 100 రికార్డులు బద్దలు.. షేక్ చేస్తున్న 'చికిరి చికిరి'
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఉప్పెన మూవీతో తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన 'చికిరి చికిరి' సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సాంగ్.. విడుదలైన కేవలం ఒక నెలలోనే తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల (పది కోట్లు) వ్యూస్ ను దాటేసింది. అంతేకాకుండా, ఈ సాంగ్ ను విడుదల చేసిన ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీలోని 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పుడు వరల్డ్ ట్రెండ్ గా దూసుకెళ్తోంది. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ ను ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ గ్రేస్, డ్యాన్స్, లుక్స్ ఆడియెన్స్ కు తెగ నచ్చేశాయి. యూట్యూబ్ షార్ట్స్ అయినా.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ ఇలా ఏ సామాజిక మాధ్యమమైనా చికిరి చికిరి సాంగ్ దర్శనమిస్తోంది. ఈ క్రమంలో ఈ పాట విడుదలైన నెల రోజుల్లోనే ఒక్క తెలుగు వర్షన్ లోనే 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది. అంతేకాక ఈ సాంగ్ ను విడుదల చేసిన ఐదు భాషల్లో కలిపి మొత్తం 150 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించింది.

ఇక ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కంటిమీద కునుకు లేకుండా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ మూవీ వాయిదా పడుతోందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయే విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications