పుష్ప 2 ను మించి హిట్ కాబోతున్న గేమ్ చేంజర్... కారణాలివే..!

మెగా పవర్ ఏంటో గ్లోబల్ గా చాటి చెప్పేందుకు గేమ్ చేంజర్ సిద్దం. నటుడిగా రామ్ చరణ్ ఎంతో పరిణితి సాధించాడని రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ చూసిన ఎవరికైనా అర్థం అయిపోతుంది. మళ్ళీ అలాంటి లార్జర్ దెన్ లైఫ్ ఉన్న క్యారెక్టర్ గేమ్ చేంజర్ మూవీ లో రామ్ చరణ్ కి పడింది. ప్రీ రిలీజ్ వేడుకలో చాలా మంది వక్తలు ఈ చిత్రం జాతీయ అవార్డ్ సాధించగలిగే సత్తా ఉన్న చిత్రమని కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఏకంగా రామ్ చరణ్ జాతీయ అవార్డ్ సాధించాలని ఆకాంక్షించారు. అసలు ఇంతకీ గేమ్ చేంజర్ ఎందుకు మిస్ కాకూడదు? రామ్ చరణ్ కి కానీ ఈ చిత్రానికి కానీ జాతీయ అవార్డ్ సాధించే సత్తా ఉందా? ఉంటే ఎందుకు అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం

రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ :

ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ స్థాయి ఏంటో ఆయనపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలు ఏంటో అందరికీ విదితమే. జపాన్ లాంటి దేశాల్లో చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు జనం. అమెరికా లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టర్ అవడం కూడా గేమ్ చేంజర్ కి బిగ్ ప్లస్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత నార్త్ బెల్ట్ లో ,ఓవర్సీస్ లో చరణ్ ఎలాంటి రికార్డులు కొల్లగొడతాడని అందరూ ఆతృత గా ఎదురు చూస్తున్నారు. గేమ్ చేంజర్ భారీ విజయం రామ్ చరణ్ కెరీర్ కి ఎంతో కీలకం. RC 16 మరింత ఎక్కువ బిజినెస్ చెయ్యడానికి ఈ చిత్ర సత్ఫలితం కొలమానం.

Ram Charan s Game Changer is a Must Watch Know Why
అప్పన్న పాత్ర పై భారీ అంచనాలు :

ఈ సినిమా లో చరణ్ తండ్రీ - కొడుకు రెండు పాత్రలూ పోషిస్తున్నారు. ట్రైలర్ లో కొడుకు రామ్ నందన్ పాత్రనే ఎక్కువ హైలైట్ చేశారు. కానీ సినిమాలో బిగ్ సర్ప్రైజ్ అప్పన్న పాత్ర. గేమ్ చేంజర్ లో అప్పన్న పాత్ర సినిమాకే బిగ్ హైలైట్ అవుతుంది అని చిత్ర వర్గాల్లో టాక్. ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అమోఘం, అద్భుతం అంటూ ఇప్పటికే మనకి సోషల్ మీడియా లో కొన్ని లీకులు సైతం దర్శనం ఇస్తున్నాయి. అప్పన్న పాత్ర కచ్చితంగా రంగస్థలం లోని చిట్టిబాబు పాత్ర ను మించి ఉంటుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఇలాంటి అమాయకపు మరియు ఆవేశం కలగలిపిన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించాలి అంటే నటుడి గా ఎంతో నేర్పు సాధించాలి. రామ్ చరణ్ ఆ పట్టు సాధించాడు ... మెప్పు పొందాడు...అప్పన్న పాత్రతో మరోసారి రుజువు చేస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Ram Charan s Game Changer is a Must Watch Know Why

వింటేజ్ శంకర్...లోడింగ్ !

శంకర్ పాత సినిమాల్ని కూడా లైబ్రరీ ఫిల్మ్స్. భారతీయుడు, ఓకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇలా సమాజంలో జరుగుతున్న పరిణామాలను కథా వస్తువు గా తీసుకుని ఆయన మార్క్ రేసి స్క్రీన్ ప్లే తో వెండితెర పై ఆయన చేసిన మ్యాజిక్ ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి శంకర్ మళ్ళీ తన వింటేజ్ మార్క్ స్క్రీన్ ప్లే తో కమ్ బ్యాక్ ఇస్తున్న మూవీ గేమ్ చేంజర్. ట్రైలర్ చూస్తూనే సినిమాలో ఉన్న భారీతనం అర్థం అవుతుంది. కచ్చితంగా వింటెజ్ శంకర్ అంటే ఏంటో గేమ్ చేంజర్ లో చూస్తారు అని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

Ram Charan s Game Changer is a Must Watch Know Why

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ :

తమన్ రీ రికార్డింగ్ గేమ్ చేంజర్ కి మరో ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా రిలీజ్ అయిన అన్ని పాటలు హిట్టే. ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ని విమర్శకులు సైతం ప్రశంసించారు. సో ఈ సినిమాకి తమన్ ఖచ్చితంగా ట్రంప్ కార్డే .

ఇవే కాదండోయ్...కార్తీక్ సుబ్బరాజ్ కథా సహకారం, కియరా అద్వానీ గ్లామర్, సునీల్ ,వెన్నెల కిషోర్,సత్య చమక్కులు, SJ సూర్య ప్రతినాయక పాత్ర, రామ్ చరణ్ డబుల్ యాక్షన్ ఒకటా రెండా ... సంక్రాంతి రిలీజ్ కి ప్రేక్షకులు ఆశించే సరిపడా కంటెంట్ మొత్తం గేమ్ చేంజర్ లో ఉంది. ఇక ఫైనల్ గా జాతీయ అవార్డ్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందర పాటే అవుతుంది కానీ కమర్షియల్ మూవీ లో నటన కి సైతం జాతీయ అవార్డ్ వస్తుందని పుష్ప లాంటి సినిమాలు నిరూపించాయి. కాబట్టి గేమ్ చేంజర్ కి సైతం ఆ అవకాశం ఉంది. రంగస్థలం మూవీ కే దక్కాల్సిన అవార్డ్ వివిధ కారణాలు వల్ల మిస్ అయ్యి ఉండవచ్చు. కానీ గేమ్ చేంజర్ తో ఆ రామ్ చరణ్ ఆ లోటు తీర్చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గ్లోబల్ లెవెల్ లో క్రేజ్ సాధించిన చరణ్ కి నేషనల్ అవార్డ్ దక్కాలని కోరుకుంటూ...గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+