రామ్ చరణ్ కెరీర్‌లో చెత్త రికార్డు.. సీరియల్ కంటే దారుణంగా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ , అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్, తన రెండో సినిమా మగధీరతో ఇండస్ట్రీ కొట్టి స్టామినా చూపించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు.అయితే భారీ ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమా అభిమానులను నిరాశ పరిచింది.

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఈ సినిమా అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చేలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు.

Ram Charan s Game Changer registers low TRP

చిత్ర నిర్మాత దిల్ రాజు సైతం గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేక్ అని బహిరంగంగా తేల్చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 195 కోట్లు వసూలు చేసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించారు. ఫలితంగా రూ.155 కోట్ల నష్టాన్ని ఈ సినిమా మిగిల్చింది. మొత్తానికి రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచిన ఈ సినిమా , తాజాగా బుల్లితెరపై కూడా డిజాస్టార్‌గా నిలిచింది. గేమ్ ఛేంజర్ శ్యాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.

తాజాగా ఈ సినిమాను జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అయింది. బుల్లితెర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు.గేమ్ ఛేంజర్ సినిమా 5.2 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్ అని చెప్పాలి. అంతే కాకుండా పడమటి సంధ్యరాగం సీరియల్ టీఆర్పీ రేటింగ్ కంటే గేమ్ ఛేంజర్ సినిమా రేటింగ్ తక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. పడమటి సంధ్యరాగం సీరియల్ 5.78 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇలా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా సీరియల్ కంటే దారుణమైన రేటింగ్‌ను సొంతం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+