ఇదేం పాటయ్యా.. 'బొక్కా. దీనక్కా.. తిక్కా'.. !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' వంటి భారీ ఫ్లాప్ తర్వాత నటిస్తూన్న సినిమా 'పెద్ది'. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తూన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తూన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను విడుదల చేశారు. చికిరి అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేశారు. అయితే ఈ పాటపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా లిరిక్స్ అసలు బాగాలేవని శ్రోతలు అభిప్రాయపడుతున్నారు.

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోను పెట్టుకుని ఇలాంటి పాటా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రెహమాన్ వంటి అస్కార్ అవార్డు గ్రహితతో 'బొక్క','తిక్క', 'దీనక్క' లాంటి పదాలు ఉన్న లిరిక్స్ కు ట్యూన్ చేయిస్తారా? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏఆర్ రెహమాన్ రేంజ్ ఏంటో మీకు తెలుసా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు పాట తెలుగు నేటివిటీకి తగ్గట్టు లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Ram Charan s Peddi First Song Draws Mixed Response Why are AR Rahman Jani Master Facing Trolls

రెహమాన్‌కు తెలుగు పెద్దగా తెలియదని, కాంపోజ్ తమిళకు తగ్గట్టే ఉందని విమర్శిస్తున్నారు. రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్‌పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ స్టెప్ చూసిన ఆడియన్స్‌కు కాస్త విభిన్నంగా అనిపించింది. నెటిజన్లు ,మీమర్స్ ఈ స్టెప్‌ను ఫన్నీ సంఘటనలకు ఉపయోగించుకుంటూ ఎడిటింగ్ వీడియోలను ఒక రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ట్రోల్ మెటీరియల్‌గా మారడంపై సినీ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు జానీ మాస్టర్ స్టెప్పులు అద్భుతమైన ఫ్లో, అందంతో కనిపించేవి. కానీ ఇప్పుడు ఆయన కంపోజ్ చేస్తున్న కొన్ని స్టెప్పులు ట్రాల్ మెటీరియల్'గా మారుతున్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. జైలుకు వెళ్ళకముందు ఆయన చివరిగా కంపోజ్ చేసిన 'గేమ్ చేంజర్' లోని 'Dhop' పాట కూడా అనుకున్న స్థాయిలో క్లిక్ అవ్వలేదు.

ఈ పాట కూడా సోసోగానే కొరియోగ్రఫి చేసినట్టు అర్థం అవుతోంది. మొత్తంగా పాటకు సోషల్ మీడియా ఆడియన్స్ నుండి యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.మొదటి పాట అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. మిగిలిన పాటలైనా బాగుంటే ఫ్యాన్స్ లో ఏర్పడిన ఈ నెగిటివ్ ఫీలింగ్ కాస్త పోతుంది.ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+