రామ్ పోతినేని వదులుకున్న బ్లాక్ బస్టర్
రామ్ పోతినేని.. మనకున్న యంగ్, ఎనర్జిటిక్ హీరోల్లో ఒకరు. దేవదాస్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం ఒకస్థాయికి చేరుకున్నారు. పూర్తిస్థాయి స్టార్ హీరోగా మారేందుకు ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేసిన స్కంద చిత్రం పరాజయం పాలైంది. హీరోయిజాన్ని ఒక రేంజ్ లో చూపించే బోయపాటితో సినిమా అంటే రామ్ మాస్ హీరోగా పూర్తి అవతారం ఎత్తినట్లేనని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా పరాజయం పాలవడం రామ్ ను నిరాశకు గురిచేసింది.
తనదగ్గరకు వచ్చిన మంచి మంచి సినిమాలను చాలా సందర్భాల్లో రామ్ వదులుకున్నాడు. కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథమీద నమ్మకం లేకపోవడం లాంటి కారణాలతో తిరస్కరించిన కథలు చాలావున్నాయి. కొంతకాలం క్రితం వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారులోకం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కథ ముందుగా రామ్ దగ్గరికే వచ్చింది. అయితే ఈ సినిమాలో ఇంటర్ స్టూడెంట్ పాత్రలో నటించేందుకు అతను వెనుకాడాడు. 2008లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కాగా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమాలో రామ్ నటించి ఉంటే అతని క్రేజ్ మరో రేంజ్ లో ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని, ఆశలు లేవనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవగా, ఆశలు అధికంగా ఉన్న సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచేవి. ఇస్మార్ట్ శంకర్ తో పూరీ కాంబినేషన్ లో సూపర్ హిట్ కొట్టిన రామ్ మరోసారి అదే మ్యాజిక్ పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.












Click it and Unblock the Notifications