అల్లు అర్జున్ రికార్డును బద్దలు కొట్టిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మిలియన్స్ మార్క్ ను శరవేగంగా క్రాస్ చేసుకుంటూ వవస్తున్న క్రమంలోనే 20 మిలియన్ మార్క్ ని చేరుకున్నారు. 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను అత్యంత వేగంగా చేరుకున్న దక్షిణ భారతదేశంలోని మొదటి నటుడిగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ పేర్లమీద ఉండేవి. 1635 రోజుల్లోనే 20 మిలియన్ మార్క్ ను చరణ్ చేరుకోవడం విశేషం.

ఈ మార్క్ ని చేరుకునేందుకు అల్లు అర్జున్ కు 1925 రోజులు పట్టగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి 2050 రోజుల సమయం పట్టింది. వీరిద్దరికన్నా అతి తక్కువ సమయంలోనే చరణ్ ఈ రికార్డును బ్రేక్ చేశారు. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ 24.2 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు. 20.7 మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరి రికార్డును రామ్ చరణ్ బ్రేక్ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమాతోపాటు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

ramcharan breaks allu arjun instagram record

భారతీయుడు 2 షూటింగ్ కు ఎక్కువ సమయాన్ని దర్శకుడు శంకర్ కేటాయించారు. దీనివల్ల గేమ్ ఛేంజర్ ఆలస్యమైంది. ఇప్పుడు భారతీయుడు2 చిత్రం షూటింగ్ పూర్తికావడంతో త్వరలోనే గేమ్ ఛేంజర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులుగానే తెరకెక్కుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+